నల్గొండ జిల్లా చందంపేట మండలంలో రోడ్డు ప్రమాదంగా నమోదైన మృతి కేసును పోలీసులు ఛేదించినట్లు దేవరకొండ డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు. బిల్డింగ్ తండాకు చెందిన రమావత్ నర్సింహ హత్య కేసులో అతని రెండో భార్య రమావత్ జ్యోతి, ఆమె అక్క రమావత్ లక్ష్మి, ప్రియుడు నేనావత్ రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట ప్రమాదంగా కనిపించిన ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మృతుడు నర్సింహకు నిందితులు మద్యం తాగించి, అనంతరం నోరు, ముక్కు మూసి హత్య చేసి, ప్రమాదంగా చిత్రీకరించినట్లు డీఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఘటన స్థలంలో ట్రాక్టర్ బ్యాటరీ, పానర్ ఉంచి దొంగతనానికి వెళ్లి ప్రమాదానికి గురైనట్లు నమ్మించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు.. డిండి సీఐ బీసన్న, చందంపేట ఎస్ఐ లోకేష్ ఆధ్వర్యంలో పోలీసులు సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ, డీఎస్పీ అభినందించారు.
నల్గొండ జిల్లా చందపేట కేసును ఛేదించిన పోలీసులు..
78
previous post





Total views : 90065