60
విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రతపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. గన్నవరం విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎబోలా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా ప్రత్యేక స్క్రీనింగ్ శిబిరం నిర్వహించారు. సింగపూర్ నుంచి వచ్చిన ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేపట్టారు.ఈ సందర్భంగా మొత్తం 185 మంది ప్రయాణికులకు వైద్య పరీక్షలు చేసినట్లు వైద్య అధికారి డాక్టర్ సృజన తెలిపారు. ప్రయాణికుల్లో జ్వరం, అనారోగ్య లక్షణాలు ఉన్నాయా అనే అంశాలను వైద్య బృందం పరిశీలించింది.విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల ఆరోగ్య భద్రత దృష్ట్యా విమానాశ్రయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు.





Total views : 90017