అమరావతిలో అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ టవర్స్, ఆలిండియా సర్వీస్ అధికారుల నివాస భవనాల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.
అమరావతి నిర్మాణంపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన మంత్రి.. తెలంగాణ సెక్రటేరియట్, పార్లమెంట్ నిర్మాణ వ్యయాలపై పూర్తి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.ఐఏఎస్ అధికారుల కోసం నిర్మిస్తున్న ఆరు టవర్లలో చాలా వరకు పనులు పూర్తయ్యాయని, జూన్ నెల నుంచి దశలవారీగా భవనాలను జీఏడీకి అప్పగిస్తామని తెలిపారు.మొత్తం 30 వేల 760 మంది రైతులు 35 వేల 59 ఎకరాల భూములు ఇచ్చారని.. అందులో 30 వేల 79 మంది రైతులకు ఇప్పటికే ప్లాట్లు కేటాయించామని చెప్పారు. కేవలం 681 మంది రైతులకు సంబంధించిన 524 ఎకరాల వ్యవహారం మాత్రమే పెండింగ్‌లో ఉందన్నారు.
అమరావతి నిర్మాణంపై వైసీపీ వ్యాఖ్యలను ఖండించిన మంత్రి..
54
previous post





Total views : 89511