Monday, June 1, 2026
News Navigation
Monday, June 1, 2026
News Navigation

Breaking

Monday, June 1, 2026
Home Andhra Pradesh కర్నూలు జిల్లాలో పర్మిషన్లు లేకున్నా అడ్డగోలు ప్రచారం చేస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థ..

కర్నూలు జిల్లాలో పర్మిషన్లు లేకున్నా అడ్డగోలు ప్రచారం చేస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థ..

by CVR NEWS
కర్నూలు జిల్లాలో పర్మిషన్లు లేకున్నా అడ్డగోలు ప్రచారం చేస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థ

కర్నూలు జిల్లాలో రెసోనెన్స్ విద్యా సంస్థ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఎలాంటి అనుమతులు లేకున్నా క్లాసులు నిర్వహించడం, సమ్మర్ స్పెషల్ క్యాంపులు నిర్వహించడం చేసిన రెసోనెన్స్ సంస్థ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ప్రభుత్వ నిబంధనలను కాలరాస్తూ ఈ నెల 31 న మెగా ఎంట్రన్స్ టెస్టు నిర్వహించేందుకు సిద్ధమైంది. వాస్తవంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇలాంటి టెస్టుల నిర్వహణ నిషిద్ధం. కానీ ఇవేవీ తమకు పట్టవు అన్నట్లుగా ఏర్పాట్లు చేసుకుంటూ పోతోంది రెసోనెన్స్ సంస్థ. అంతేకాదు ఒక్కో విద్యార్థి నుంచి 99 రూపాయల ఫీజు కూడా వసూలు చేస్తోంది. రెసోనెన్స్ సంస్థ ఆగడాలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.
ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకున్నా రెసోనెన్స్ విద్యా సంస్థ అడ్డగోలు ప్రచారం నిర్వహిస్తోందని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. స్కూల్, కాలేజ్ కు పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు ఓపెన్ అంటూ భారీ పబ్లిసిటీ చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్ మీడియట్, జిల్లా విద్యాశాఖ శాఖ అధికారులు మౌనంగా ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మెగా టెస్ట్ ను అధికారులు అడ్డుకోవాలని విద్యార్థి సంఘాల డిమాండ్ చేస్తున్నాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019200
Total views : 90087

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.