56
ఆర్టీసీ బస్సులో నాలుగున్నర తులాల బంగారం చోరీ అయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన దేవలక్ష్మి అనే మహిళ రామాయంపేట మండలం అక్కన్నపేటలో తన బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి తిరిగి వెళుతుంది. ఇదే క్రమంలో అక్కన్నపేట నుండి రామయంపేటకు ఆర్టీసీ బస్సులో వచ్చిన దేవలక్ష్మి. ఆర్టీసీ బస్టాండ్లో దిగి ఆర్మూర్ బస్సు ఎక్కింది. ఇదే క్రమంలో తన చేతి సంచిలో ఉన్న సుమారు నాలుగున్నర తులాల బంగారు ఆభరణాల సంచి కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఆర్టీసీ బస్సును స్టేషన్ కు తరలించి అందులోని ప్రయాణికులను పూర్తిగా తనిఖీ చేశారు. ఎవరి వద్ద బంగారు ఆభరణాలు లభించలేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.





Total views : 90065