Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Andhra Pradesh హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా కొనసాగుతున్న టీడీపీ మహానాడు …

హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా కొనసాగుతున్న టీడీపీ మహానాడు …

by CVR NEWS
హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా కొనసాగుతున్న టీడీపీ మహానాడు

టీడీపీ పసుపు పండుగ మహానాడు హైబ్రిడ్‌ విధానంలో అట్టహాసంగా కొనసాగుతుంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధినేత చంద్రబాబు తెలుగుదేశం జెండా ఆవిష్కరించి, ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నారా లోకేశ్‌ , పొలిట్‌ బ్యూరో సభ్యులు, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. 1875 క్లస్టర్ల నుండి వేలాదిమంది కార్యకర్తలు ఈసారి మహానాడును హైబ్రిడ్ విధానం ద్వారా వీక్షించారు. ముఖ్య నాయకుల స్పీచ్‌లను హైబ్రిడ్ విధానంలో 175 నియోజకవర్గాల నేతలు, కార్యకర్తలు ఈసారి ఆన్‌లైన్‌లోనే విన్నారు. దానికి సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అన్ని ఏర్పాట్లు చేశారు.

స్థానిక ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఏ ఎన్నికలైనా గెలుపే ప్రధానమని స్పష్టంచేశారు. గెలుపే ధ్యేయంగా నేతలు, కార్యకర్తలు పని చేయాలని, ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ ముందుకు సాగాలన్నారు. ఎవరూ ఇగోలకు వెళ్లొద్దని చంద్రబాబు హితవు పలికారు. మిత్ర పక్షాలతో సఖ్యతతోనూ.. సమన్వయంతో ముందుకు వెళ్దామని దిశానిర్దేశంచేశారు. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా అందరం మమేకం అవుదామన్నారు. స్పెషల్ రివిజన్‌లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, కేడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

తెలుగుదేశం బలం బలగం కేడర్ అన్న చంద్రబాబు.. ఏదైనా పార్టీ ఫస్ట్, కేడరే ముందని తెలిపారు. నాయకులను తయారు చేసే విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అని అన్నారు. ఇక్కడ చదువుకున్న, శిక్షణ పొందిన నాయకులే అన్ని చోట్లా రాణిస్తున్నారని గుర్తుచేశారు. సోషల్ రీ ఇంజినీరింగ్ చేయటమే పార్టీ విధానమని తెలిపారు. అందరికీ అవకాశాలు కల్పించటమే పార్టీ లక్ష్యమని తెలిపారు. పార్టీ అధినేతగా.. పార్టీ కుటుంబసభ్యులైన కార్యకర్తల ఎంపవర్‌మెంట్ కోసం నిరంతరం పనిచేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

తెలుగుదేశం పార్టీలో ఇకపై మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్‌ కీలక ప్రకటన చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పాసైనా… అవ్వకపోయినా పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామని వెల్లడించారు. బిగ్ అనౌన్స్‌మెంట్‌ అని ఉదయం పెట్టిన పోస్టుకు అనుగుణంగా తన ప్రసంగంలో మహిళలకు రిజర్వేషన్ అంశాన్ని నారా లోకేశ్‌ ప్రకటించారు. మహానాడు ఆఫ్‌లైన్ అయినా, హైబ్రిడ్ మోడల్ అయినా టీమ్ 11కి బ్యాటింగ్ తప్పదని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. వైఎస్ వివేకానందారెడ్డి హత్యపై మండిపడ్డారు. బాబాయిని గొడ్డలితో చంపింది నిజం కాదా? అని, అందుకే వాళ్లది గొడ్డలి పార్టీ అని లోకేశ్ విమర్శించారు. టెన్త్ క్లాస్ పేపర్ కొట్టేసిన చరిత్ర సైకోదని, తనది స్టాన్‌ఫోర్డ్ హిస్టరీ అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. పార్లమెంటులో బిల్లు పాసైనా, అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ తరపున వచ్చే ఎన్నికల్లో మహిళలకు 33శాతం సీట్లు కేటాయిస్తామన్నారు. ఈ మేరకు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఇది తమ సంకల్పమని, తమ బాధ్యత, తమ కమిట్ మెంట్ అని వ్యాఖ్యానించారు. టైమ్, డేట్ ఫిక్స్ చేస్తే అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు సిద్ధమని మంత్రి లోకేశ్ సవాల్ విసిరారు.

టీడీపీ నాయకులు, కార్యకర్తలంతా ఐక్యతను చాటుకునే వేదిక మహానాడు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. మహానాడు ప్రారంభం సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు.. ఇప్పటి వరకూ పార్టీ ప్రయాణం, భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలు ఇతర అంశాలను ఈ వేదిక ద్వారా చర్చించుకుందామన్నారు. హైబ్రిడ్ విధానంలో మహానాడు 2026 ద్వారా లక్షల సంఖ్యలో నేతలు, కార్యకర్తలు అనుసంధానమై ఉన్నారని తెలిపారు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు వచ్చి కాలగర్భంలో కలిసి పోయాయని, టీడీపీ ఒక్కటే నిత్యచైతన్యంతో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలందరికీ అవకాశాలు కల్పిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన 23 నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులూ కార్యకర్తలకు ఇచ్చామని, భవిష్యత్తులోనూ ఇంకా వస్తాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దేలా ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్‌-2047 రూపొందించారన్నారు.

అణచి వేసే ప్రయత్నం చేస్తే తెలుగుదేశం పార్టీలో యోధులు పుట్టుకొస్తారని గొడ్డలిపార్టీకి అర్థమై ఉంటుందని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీకి లోకేశ్‌ తన పాదయాత్రలో ట్రైలర్‌ చూపిస్తే.. ఆ తర్వాత ఎన్నికల్లో ప్రజలు సినిమా చూపించారన్నారు. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదికను బైరెడ్డి శబరి సమర్పించారు. రాజకీయ ప్రత్యర్థి జిత్తుల మారి నక్క.. కార్యకర్తల డేగ కన్నుతో నిఘా పెట్టాలి… నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. సంక్షేమంతోపాటు అభివృద్ధిలోనూ టీడీపీ ముందంజలో ఉందని తెలిపారు. 20 లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా నారా లోకేశ్‌ కృషి చేస్తున్నారన్నారు. అండమాన్‌లోనూ టీడీపీ జెండా రెపరెపలాడుతోందని ప్రశంసించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: