Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Latest News బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్..

by CVR NEWS
బాల్కసుమన్కు 14 రోజుల రిమాండ్

సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ కీలక నేత బాల్క సుమన్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. గతంలో సింగరేణి సంస్థను, అధికారులను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సదరు అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్ ప్రధాన కార్యాలయమైన ‘తెలంగాణ భవన్’ వద్ద భారీ బందోబస్తు మధ్య బాల్క సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సమయంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టు అనంతరం బాల్క సుమన్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించిన అధికారులు, దాదాపు ఆరున్నర గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా, కేసు తీవ్రతను పరిశీలించిన జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు ఆయనను గట్టి భద్రత నడుమ హైదరాబాద్‌లోని చంచల్‌గూడ కేంద్ర జైలుకు తరలించారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

019115
Total views : 89928

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.