Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home International అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..

by CVR NEWS
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం

అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. అయోవా రాష్ట్రంలోని మస్కటీన్ నగరంలో వరుసగా చోటుచేసుకున్న కాల్పుల ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అనుమానిత నిందితుడు కూడా ఉండటం సంచలనంగా మారింది. కుటుంబ వివాదమే ఈ ఘటనలకు కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. 210 పార్క్ అవెన్యూలోని ఓ నివాసంలో కాల్పులు జరిగాయంటూ సమాచారం అందడంతో పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ తుపాకీ గాయాలతో నలుగురు వ్యక్తులు కనిపించగా.. వారిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మస్కటీన్‌కు చెందిన ర్యాన్ విల్లీస్‌ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకునేలోపే అతడు పరారయ్యాడు. అనంతరం అతడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు, మరో ప్రాంతంలో విల్లీస్ తుపాకీతో తనను తాను కాల్చుకుని మృతి చెందినట్లు గుర్తించారు. అదే సమయంలో మస్కటీన్‌లోని మరో నివాసంతో పాటు గ్రాండ్‌వ్యూ అవెన్యూలోని ఓ వ్యాపార సముదాయంలో కూడా ఇద్దరు వ్యక్తులు తుపాకీ గాయాలతో మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మొత్తం ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ అంతర్గత వివాదమే ఈ కాల్పులకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: