చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలంలో దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. బైరెడ్డిపల్లి మండలం పాతపేటలో గంగమ్మ జాతర సందర్భంగా జరిగింది ఈ ఘటన. గంగమ్మ జాతరలో భక్తులకు పంపిణీ చేసిన కూల్‌డ్రింక్ తాగిన అనంతరం దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. చిన్నారులు, గర్భిణీలు సహా పలువురు అనారోగ్యానికి గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. అయితే వైద్యుల సకాల చర్యలతో బాధితులంతా కోలుకోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. జాతరలో పాల్గొన్న భక్తులకు పంపిణీ చేసేందుకు స్థానిక మహిళ తమిళనాడు నుంచి తీసుకొచ్చిన ఆరెంజ్ కలర్ లిక్విడ్‌తో జ్యూస్ తయారు చేసింది. ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఆ జ్యూస్ పంపిణీ చేయగా, తాగిన కొద్దిసేపటికే చిన్నారులు, పెద్దలు, గర్భిణీలు సహా సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా పలువురు అనారోగ్యానికి గురికావడంతో గ్రామంలో కలకలం రేగింది. సమాచారం అందుకున్న వెంటనే బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయ్ చందర్ తన వైద్య బృందంతో ఘటనాస్థలికి చేరుకుని బాధితులకు చికిత్స అందించారు. ఐతే జ్యూస్ వల్లే అస్వస్థతకు గురయ్యారా? లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.
జాతరలో కూల్‌డ్రింక్ తాగి 70 మందికి అస్వస్థత..
27
previous post



Total views : 92042