Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Andhra Pradesh అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చోరీ కలకలం..

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చోరీ కలకలం..

by CVR NEWS
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో చోరీ కలకలం

అనకాపల్లి జిల్లాలోని ప్రముఖ ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది.నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయంలో అర్ధరాత్రి సమయంలో రెండు హుండీలు అపహరించబడ్డాయని తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు ప్రారంభించారు.సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలిస్తున్న పోలీసులు, ఆలయ సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తోంది.హుండీల్లో ఉన్న నగదు ఎంత అన్నది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. అయితే సుమారు 30 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు నగదు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి కూడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆరు సంవత్సరాలుగా హుండీ ఆదాయం తరలించకపోవడం కూడా గమనార్హంగా మారింది. ఆలయ భద్రతలో లోపమే ఈ చోరీకి కారణమని భక్తులు ఆరోపిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

020000
Total views : 92037

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.