573
పల్నాడు జిల్లా వినుకొండలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహిళపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ చిన్న మల్లయ్య..పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. అత్యాచారం చేశాడని సీఐ చిన్నమల్లయ్యపై ఏప్రిల్ 29న మహిళ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయ్యారు చిన్నమల్లయ్య. దాదాపు నెల రోజుల తర్వాత ఇవాళ పోలీసుల ఎదుట లొంగిపోయారు. చిన్నమల్లయ్యను ఇటీవలే ఉద్యోగం నుంచి డిస్మిస్ చేశారు అధికారులు. ఐతే తాజాగా ఆయన్ను శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.