గన్నవరం ఎమ్మెల్యే ఉన్న యార్లగడ్డ వెంకట్రావు సొంత ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్టు టెర్మినల్ పనుల కాంట్రాక్టును KMV సంస్థకు ఇవ్వడంపై ఎమ్మెల్యే యార్లగడ్డ తీవ్రంగా మండిపడ్డారు. గత ఎన్నికల్లో తమ ప్రత్యర్థుల కోసం, వైసీపీ కోసం పనిచేసిన కంపెనీకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టులు ఎలా కట్టబెడతారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం రాత్రింబగళ్లు కష్టపడిన వారిని కాదని, ప్రత్యర్థులకు కొమ్ముకాసిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నా రెక్కల కష్టం, నా సొంత డబ్బు ఖర్చు పెట్టి పార్టీని గెలిపించుకుంటే.. ఇప్పుడు నన్ను ఈ రకంగా అవమానాల పాలు చేస్తారా అంటూ నిలదీశారు. గన్నవరం నియోజకవర్గంలో తన హక్కుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధిగా ప్రోటోకాల్ ప్రకారం తనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోతే అస్సలు సహించేది లేదని హెచ్చరించారు. ఎన్నికల ముందు వచ్చి కష్టపడిన వాడు ముఖ్యమా..? లేక అధికారం వచ్చాక మధ్యలో వచ్చిన వాడు ముఖ్యమా..? అంటూ యార్లగడ్డ వేసిన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తీవ్ర అసహనం.
203
previous post