Wednesday, July 15, 2026
News Navigation
Wednesday, July 15, 2026
News Navigation

Breaking

Wednesday, July 15, 2026
Home Latest News మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్.

by CVR NEWS
మహానగర ప్రజా రవాణాపై HMDA ఫోకస్

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటు చేసిన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ నాలుగు వర్కింగ్ గ్రూపుల చైర్మన్ల సమావేశం ఈనెల 30న జరగనుంది. మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ అండ్ రెగ్యులేషన్ కమిటీ చైర్మన్‌గా ఉన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్, ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కమిటీ చైర్మన్‌గా ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, రోడ్డు అభివృద్ధి, ట్రాఫిక్, రవాణా కమిటీకి చెందిన మూడు కార్పొరేషన్ల పరిధిలోని 12 మంది జోనల్ కమిషనర్లు హాజరుకానున్నారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ పరిధిలోని ట్రాఫిక్ నిర్వహణ, ప్రజారవాణా వ్యవస్థ బలోపేతం, రహదారుల అభివృద్ధి, ట్రాన్స్‌పోర్ట్ సమన్వయం వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే ఉమ్టా వర్కింగ్ గ్రూపుల్లో చురుకుగా పనిచేస్తున్న అధికారులను సభ్యులుగా నియమించే అంశంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ నిర్వహణ, ప్రజారవాణా సేవల మెరుగుదలకు దోహదపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040416
Total views : 207700

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: