అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. గల్లంతైన మత్స్యకారుల వ్యవహారంపై సమీక్ష నిర్వహించారు. సముద్రంలో గల్లంతైన 8 మంది మత్స్యకారుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు. గాలింపు చర్యలకు సంబంధించిన సమాచారాన్ని వారి కుటుంబాలకు ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్పష్టం చేశారు. గల్లంతైన బోటు జాడ కోసం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టాలని ఆదేశించారు. కోస్ట్‌గార్డ్, మత్స్యశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సముద్రంలో కొనసాగుతున్న గాలింపు చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. మత్స్యకారులను సురక్షితంగా కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అమరావతి: మత్స్యకారుల గల్లంతుపై సీఎం చంద్రబాబు సమీక్ష.
27
previous post