Thursday, August 20, 2026
News Navigation
Thursday, August 20, 2026
News Navigation

Breaking

Thursday, August 20, 2026
Home Andhra Pradesh కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం.

కూటమి ప్రభుత్వంపై వైసీపీ అసత్య ప్రచారం.

by CVR NEWS

వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. రైతులకు12 వేల 500 రూపాయలు ఇస్తామని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 7వేల 500 రూపాయల మాత్రమే ఇచ్చి జగన్ మోసం చేశారని విమర్శించారు. రైతుల విషయంలో వైసీపీ ప్రభుత్వం దగా చేసిందని మండిపడ్డారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతుల సంక్షేమంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. జగన్‌కు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి అన్ని అంశాలపై చర్చించాలని అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల నిర్మాణం, అభివృద్ధి పనులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గతంలో నిధులు కేటాయించినప్పటికీ పనులు ఎందుకు ముందుకు సాగలేదో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత గత ప్రభుత్వంపై ఉందన్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: