ఏపీలో వాతావరణశాఖ భారీ వర్షాలపై హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజులపాటు తొమ్మిది జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. విశాఖ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా పిడుగులు, బలమైన గాలుల సమయంలో బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో రెండు మూడు రోజులుగా పొడి వాతావరణం కొనసాగుతోంది. మధ్యాహ్నం ఎండలు మండిపోతుండగా.. పలుచోట్ల చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో ఎండాకాలాన్ని తలపించేలా ఉక్కపోత నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా వర్షసూచనతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించే అవకాశం ఉంది. వర్షాలతో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.
ఏపీకి భారీ వర్షసూచన.. 9 జిల్లాలకు అలర్ట్.
10
previous post