East Godavari
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం నియోజవర్గంలో భారీ స్థాయిలో వైయస్సార్ రైతు రథం యాత్ర. వైయస్సార్ రైతు భరోసా రెండోవ విడత కార్యక్రమాన్ని పురస్కరించుకొని భారీగా ట్రాక్టర్ ర్యాలి నిర్వహించిన రైతులు. గాడాల గ్రామం నుండి శ్రీరంగపట్నం గ్రామం వరకు కొనసాగిన ర్యాలీ ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజాపాల్గొని స్వయంగా ట్రాక్టర్ నడిపారు. ర్యాలీ అనంతరం శ్రీరంగపట్నంలో వైయస్ఆర్ రైతు భరోసా -పి ఎం కిసాన్ 2వ విడత పంపిణీ కార్యాలయం కి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవిలత, జేసీ తేజ్ భరత్, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా,డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
Read Also..
ఏపీలో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ తమిళనాడు పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమ వాయువ్యంగా పయనించి అరేబియా సముద్రంలో ప్రవేశించనుంది. ఈ ప్రభావంతో నవంబర్ 8 న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని కారణంగా ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా మారి.. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయి. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, శ్రీ సత్యసాయి, తిరుపతి, కడప జిల్లాల్లో భారీ వానలు కురుస్తాయంటున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బు వాతావరణం ఉంటుంది అంటున్నారు. అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల జల్లులు, మబ్బుగా ఉంటుందని వాతవరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
అంబాజీపేట మండలం మాచవరం గ్రామపంచాయతీ పరిధిలో చెత్త వ్యర్ధాలను గత సంవత్సరం నుండి ప్రధాన రహదారికి ఇరువైపులా మరియు గ్రామంలో ఎక్కడ పడితే అక్కడ వ్యర్థాలను ఇష్టారీతిన వేస్తున్న ఆ వ్యర్థ పదార్థాలను తొలగించవలసిన గ్రామపంచాయతీ వాళ్ళు నిర్లక్ష్య వైఖరి వహిస్తున్నారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాచవరం గ్రామపంచాయతీ వద్ద ఒకరోజు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. దీనికి మద్దతుగా రైతు సంఘాల నాయకులు, వ్యాపారస్తులు సంఘీభావం ప్రకటించారు. వెంటనే స్పందించిన జిల్లా అధికారులు ఈ సమస్యను సత్వరం పరిష్కరించి వ్యర్ధాలను తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కామన ప్రభాకర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడునెల్లి వెంకటరమణ, రైతు సంఘాల నాయకుడు పత్తి దత్తుడు, నక్క భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం మండలం గోదారి గట్టు రహదారిపై రోడ్ ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న వ్యక్తి దుర్మరణం.. మృతుడు వంగలపూడి గ్రామానికి చెందిన పిటక వెంకటేశ్వరరావు (32),గా గుర్తింపు.. ఘటనా స్థలం భారీగా నిలిచిపోయిన వాహనాలు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతుడు సీతానగరం నుండి వంగలపూడి వెళుతుండగా జరిగిన ప్రమాదం…
దేవరపల్లి వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు అదుపుతప్పి ట్యాంకర్ లారీను ఢీకొట్టి డ్రైన్లో పడింది. నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి, ప్రమాద సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉన్నారు. జగ్గంపేట మండలం తాళ్లూరులో రాత్రి వివాహ వేడుక పూర్తి చేసుకుని పెద్దతాడేపల్లి, సత్యనారాయణ వ్రతానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండల పరిషత్ లో ఇఓ.పి.ఆర్. ఆర్.డి. వెంకటేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమలాపురంలో నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు.. రాత్రి ఇంటికి రావడం లేదు భీమవరం వెళుతున్నానని చెప్పి తన కార్యాలయ గదిలో ప్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు.. క్లోజ్ టీం తో తనిఖీ చేస్తూ ఘటనపై ఆరా తీస్తున్నారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట (మం) పలివెల గ్రామవాలంటీర్ సుబ్రహ్మణ్యం మరో మహిళా వాలంటీర్ ను లైంగికంగా వేధించాడు. వాలంటీర్ సుబ్రహ్మణ్యం పై కొత్తపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మహిళ వాలంటీర్ ను తన కోరిక తీర్చాలంటూ వాలంటీర్ సుబ్రహ్మణ్యం లైంగికంగా వేధించాడు. కొత్తపేట మండలంలోని పలివేల గ్రామంలో సుబ్రహ్మణ్యం, బాధితురాలు వాలంటీర్లు గా చేస్తున్నారు. గతకొంత కాలంగా వేధిస్తున్నడంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో అర్ధరాత్రి దాటిన తరువాత కత్తులు చూపించి చంపేస్తామని బెదిరించిన నలుగురు దుండగులు పందెం కోళ్లను చోరీ చేసిన సంఘటన తీవ్ర సంచలనంగా మారింది. ఎప్పటి లాగానే గ్రామంలోని రోడ్డు పక్కనే ఉన్న చిన్న కోళ్ల ఫారంలో నిదురిస్తున్న మెతుకుమిల్లి శ్రీనివాసరావు, పద్మావతి దంపతులను కత్తులు మెడపై పెట్టి చంపేస్తామని బెదిరించిన నలుగురు గుర్తు తెలియని దుండగులు. కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన అగంతకులు మెరుగైన 11 పందెం కోడిపుంజులను చోరీ చేశారు. బయటకు అరిస్తే చంపేస్తామని కత్తులతో బెదిరించినట్లు బాధితులు శ్రీనివాసరావు, పద్మావతి దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోడిపుంజులను చోరీ చేసి దుండగులు ఉడాయించగా, అక్కడే ఉన్న వాహనాన్ని నడిపేందుకు ప్రయత్నించగా, అగంతకులు స్టార్ట్ కాకుండా చేశారని వాపోయారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.
టిడిపి జనసేన ఆత్మీయ సమ్మేళనాలు జిల్లాల వారీగా మూడు రోజులు పాటు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఆత్మీయ సమ్మేళనం కాకినాడలో జరిగింది. తెలుగుదేశం పార్టీ తరపున ప్రతినిధిగా ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్తామని జగన్ కు తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా రవీంద్ర పేర్కొన్నారు. జగన్ అనే వైరస్ కు జనసేన, టిడిపి సరైన వ్యాక్సిన్ అని చెబుతున్న రవీంద్ర తో మా ప్రతినిధి నందిని ఫేస్ టు ఫేస్.



Total views : 61577