పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం లో ప్రభాస్ పుట్టినరోజు వేడుకలను అభిమానులు ముందస్తుగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నరసాపురం పట్టణంలో 216 నేషనల్ హైవేపై ప్రభాస్ అభిమానులు బైక్‌లతో వీరంగం సృష్టించారు. దీనితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయి ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అభిమానుల తీరుపై ప్రయాణీకులు మండిపడ్డారు. అబిమానులు సేవా కార్యక్రమాలతో ఆదర్శంగా నిలవాలి తప్ప బైక్ లతో వీరంగం సృష్టించటం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు పోలీసులు ఎక్కడా కనిపించలేదు.
Andhra Pradesh
విజయవాడ ఏసిబి కోర్టులో చంద్రబాబునాయుడు బెయిల్ పిటిషన్ మరియు సిఐడి కస్టడీ పిటిషన్ లపై విచారణ టిడిపి తరఫు దూబే సిఐడి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు స్కిల్ స్కాం లో క్యాష్ పిటిషన్ పై వాదనలు జరగబోతున్నాయి 17/a చంద్రబాబు నాయుడు కు వర్తించే అవకాశం ఉన్నప్పటికీ 2015లో జరిగిన స్కాం కావడంతో సిఐడి తరపు న్యాయవాదులు అడ్డుపడే అవకాశం ఉందంటున్న అడ్వకేట్ సుధాకర్ తో అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్.
ఏపీలో మహిళలు అత్యంత పేదరికంతో బాధపడుతున్నారని… పేదరికంతో వారు అనుభవిస్తున్న పరిణామాలను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నానని టీడీపీ యువనేత నారా లోకేశ్ అన్నారు. మహిళలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ తొలి స్థానంలో ఉందని చెప్పారు. వ్యభిచారం కారణంగా బాలికలు యుక్త వయసులోనే గర్భవతులు అవుతుండటం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. దీనిపై పోలీసులు దృష్టి సారించడం లేదని… ఎందుకంటే, ప్రతిపక్షాల గొంతు నొక్కే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారని విమర్శించారు. ఈ సోదరీమణులకు తగిన భద్రత, గౌరవప్రదమైన జీవితాలను అందించడంలో సైకో జగన్ బూటకపు సంక్షేమం విఫలమయిందని దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయి పేలుడు సంభవించింది. గ్రామ ఉపసర్పంచ్ మామిడి మల్లిబాబు నివాసంలో వంట చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 14 ఏళ్ల శ్రావణి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ౨౫ ఏళ్ల చిన్నబాబు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడగా, మరో ఇద్దరు స్వల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పేలుడు భారీగా జరగడంతో ఇంట్లోని సామగ్రి ధ్వంసం కాగా, ఇల్లు పూర్తిగా దెబ్బతింది. పిఠాపురం సీఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విద్యాధరపురంలో శుక్రవారం జగనన్న వాహన మిత్ర కార్యక్రమం ద్వారా 2,75, 931 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున 275.93 కోట్ల రూపాయలు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్న నేపద్యంలో సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వరుసగా ఐదవ ఏడాది జగనన్న వాహన మిత్ర పథకం ద్వారా లక్షలాది మందికి లబ్ధి చేకూరుస్తున్నామని మంచి కార్యక్రమాలు చేస్తుంటే జనసేన పని పాట లేని కార్యక్రమాలు చేపడుతున్నాయని, పవన్ కళ్యాణ్ షూటింగ్ చేసుకుంటుంటే జనసేన కార్యకర్తలకు రోడ్లమీద మీకేం పని అంటున్న ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ తో మా అమరావతి బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష కారణంగానే జరిగిందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. చంద్రబాబు అరెస్ట్ దుర్మార్గం అని, చంద్రబాబు అమాయకుడని పేర్కొన్నారు. ఇది కావాలని చేసిన చర్యేనని తెలిపారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం వెనుక ఉన్నది బీజేపీనే అని ఢిల్లీలో పాలు తాగే పిల్లవాడ్ని అడిగినా చెబుతారని చింతా మోహన్ వ్యాఖ్యానించారు. పేరుకే జగన్ మోహన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం, సీఐడీ ఉన్నాయే కానీ, దీని వెనుక ఢిల్లీ పెద్దల ప్రమేయం ఉందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నారు. జడ్జిలకు 17ఏ అంశంపై స్పష్టత ఇచ్చేందుకు 40 రోజులకు పైగా సమయం కావాల్సి వచ్చిందా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని చింతా మోహన్ స్పష్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని… అన్ని ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆధారాలు ఉండటం వల్లే ఆయనకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని అన్నారు. ఏ వయసులో తప్పు చేసినా నేరం నేరమేనని చెప్పారు. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోబోతున్నారని తెలిపారు.
చంద్రబాబు లక్కీ నెంబర్ 23 అని… తమ పార్టీకి చెందిన 23 మందిని ఆయన లాక్కున్నారని… 2019లో ఆయనకు వచ్చిన సీట్లు కూడా 23 అని… ఆయన జైలుకు వెళ్లిన తేదీ కూడా 23 అని అనిల్ ఎద్దవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలే సైలెంట్ గా ఉన్నారని… తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు మాత్రం లేనిపోని హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
ఏలూరు జిల్లా ఏలూరు సమన్వయ కమిటీ సమావేశం ఏర్సాటు చేశారు. ఈ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసి సమావేశాన్ని బాయికాట్ చేశారు. అనంతరం నియోజకవర్గంలోని రైతులకు సాగు నీరు అందించలేకపోతున్నాను అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కృష్ణా డెల్టా ఇరిగేషన్ అధికారులు నా నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసారంటూ సాక్షాత్తు ఎంపీ సమక్షంలోనే ఘాటు వ్యాఖ్యలు చేసారు. కైకలూరు నియోజకవర్గానికి తగిన స్థాయిలో నీరు అందించకపోతే నేను నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు నీరు అందించకపోతే తన పదవికి రాజీనామా చేసి, రైతులతో కలిసి పోరాడతానన్నారు. ఎమ్మెల్యేను సర్ది చెప్పే ప్రయత్నం చేసిన జాయింట్ కలెక్టర్, ఎంపీ కోటగిరి శ్రీధర్ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఏలూరు నుంచి మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులా పని చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీకి వత్తాసు పలుకుతున్న సీఐడీ చీఫ్ సంజయ్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ రాజకీయ పక్షపాతాలు లేకుండా పని చేయాలని, కానీ ఆయన అలా ఉండటం లేదన్నారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే, విచారణ చేయకుండానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.





Total views : 202719