గజపతినగరం జాతీయ రహదారి పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంపై విద్యుత్ షాక్ తో వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి విశాఖ జిల్లా పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన రామస్వామి (45) గా గుర్తింపు.. పద్మభనాభం మండలం నుండి ఇటుకలు వ్యాను తీసుకొని గజపతినగరం వచ్చిన రామస్వామి… ఇటుకలు అన్ లోడ్ చేసిన అనంతరం మూడవ అంతస్థు పైకి ఎక్కడం తో సమీపంలో గల 11 కేవి విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు.
Vijayanagaram
విజయనగరం జిల్లా కొత్తవలస శారడ మెటల్స్ కంపెనీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిన్న కంపెనీలో ప్రమాదవశాత్తు గాయపడి తిమిడి గ్రామానికి చెందిన కార్మికుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేయకుండా, సంఘటన సమాచారాన్ని బయటకి పొక్కకుండా కంపెనీ యాజమాన్యం ప్రయత్నాలు చేస్తోంది. కార్మిక మరియు ప్రతిపక్ష నాయకులతో కలిసి కంపెనీ గేటు వద్ద మృతుని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని 50 లక్షల రూపాయలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కంపెనీలో కార్మికుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విశాఖ ఫిషింగ్ హర్బర్ అగ్నిప్రమాదం కేసును పోలీసులు ఛేదించారు. స్థానిక మత్స్యకారులు వాసుపల్లి నాని, అతని మామ సత్యమే ఈ ప్రమాదానికి కారణమన్నారు సీపీ రవి శంకర్. వీరిద్దరూ అల్లిపల్లి వేంకటేశ్ చెందిన 887 బోటులో మద్యం తాగారని పేర్కొన్నారు. అనంతరం సిగరెట్ కాల్చి పక్కనే ఉన్న 815 నెంబర్ బోటులో వేశారని అన్నారు. మంటలు బాగా వ్యాపించడంతో ఇద్దరు అక్కడ నుంచి పరారయ్యారని తెలిపారు. ఈ ఇద్దరిపై ఐపిసి సెక్షన్ 437,438,285 కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసు అనుమనితుల్లో ముగ్గురు నానిలు ఉన్నారని సిపి తెలిపారు. విచారణలో భాగంగానే యూట్యాబర్ నానిని తీసుకొచ్చామన్నారు. విచారణలో అతని ప్రమేయం లేదంటే తాము ప్రోసిజర్ ప్రకారం విడిచి పెట్టే వాళ్ళమన్నారు. ఈ కేసుకు సంభందించి 50 కు ఫైగా సిసి కెమెరాలను పరిశీలించామని తెలిపారు. నిందితులు సిగరేట్ విసిరివేయ్యడంతో వలలకు నిప్పు అంటుకుందని ఆ సమయంలో గాలులు కూడా బాగా వీయడంతో మంటలు త్వరగా వ్యాపించాయని వివరించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని కమాండ్ కంట్రోల్ ద్వారా హార్బర్ మోనటరింగ్ చేస్తామని సీపీ రవి శంకర్ తెలిపారు
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి, విజయవాడ ఈరోజు హుండీ లెక్కింపు (21-11-2023): 20 రోజులకు నగదు: రూ.3,34,32,887/- లు, కానుకల రూపములో బంగారం: 935 గ్రాములు, వెండి: 7 కేజీల 328 గ్రాములు భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు. ఈరోజు హుండీ లెక్కింపు నకు ఆలయ కార్యనిర్వాహణాధికారి శ్రీ కె.ఎస్ రామారావు గారు, దేవాదాయ శాఖ అధికారులు, SPF మరియు I-టౌన్ పోలీసు సిబ్బంది హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. online నందు e – హుండీ ద్వారా రూ. 89,817/-లు విరాళముగా భక్తులు చెల్లించుకొన్నారు
విజయనగరం జిల్లా లక్కవరపుకోట గవరవీధిలో గ్యాస్ సిలిండర్ పేలి 5 గురికి తీవ్ర గాయాలు వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఇందులో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.. వీరిని శృంగవరపుకోట ప్రభుత్వ ఆసుపత్రికి 108 లో తరలించారు. ఉదయం టీ పెట్టుకుందామని గ్యాస్ వెలిగించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలడంతో ఘటన జరిగిందని సమాచారం. గాయాలు పడిన వారికి ప్రధమ చికిత్స చేసి విశాఖ కె.జి.హెచ్ కు తరలించారు. ఓకే కుటుంబానికి చెందిన వారు గాయ పడిన వారి వివరాలు తామరాపల్లి వెంకటలక్ష్మి 50 సం,, ప్రాణవి 7 సం,, కెల్లా మోహన్ 10 సం,, కెల్లా లాష్య 8 సం,, కెల్లా శ్రావణి 30 సం,, సంఘటన స్థలానికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే మరియు శృంగవరపుకోట నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జి కోళ్ల లలిత కుమారి.. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఎల్.కోట గ్రామ పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా ఈ రోజు జరిగిన గ్యాస్ సిలిండర్ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం అని అన్నారు. ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోని గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించి, వెంటనే బాధితుల కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు
పార్వతీపురం మండలంలోని పుట్టూరు గ్రామముకు చెందిన ఆదిమూల లక్ష్మణ, భార్య గుంపమ్మ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీళ్ళకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె ఉన్నారు. వీళ్ళ పెద్ద కుమారుడు ఆరు నెలల కిందట దురదుష్టవసాత్తు మేడ మీద నుంచి జారి పడి చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూలీ పనులు చేసుకుంటూ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులకు చేద పురుగులు పట్టి ఎందుకు పనికిరాని చెత్తగా మారడంతో ఆ కుటుంబం దిక్కుతోచని పరిస్థితుల్లో పడింది. కూతురుకు పెళ్లి చెయ్యాలని గత కొన్ని నెలలుగా ట్రంక్ పెట్టేలోని ఒక బ్యాగ్ లో దాచారు. డబ్బుల కోసం ఆ పెట్టెను తెరవగా చెద పురుగుల మధ్య 500 రూ, 100 రూ నోట్లు ముక్కలుగా మారి మట్టితో కనిపించాయి. సుమారు రెండు లక్షల రూపాయలు చెదలు పట్టి ముక్కలు ముక్కలుగా కనిపించడంతో భాదితులు కన్నీరు మున్నీరు అయ్యారు. చెమట చిందించి కష్టపడి సంపాదించిన డబ్బులకు చెద పురుగులు పట్టడంతో ఆ రైతు ఆవేదన చూసి స్థానికులు చలించిపోయారు.. ప్రభుత్వం కానీ నాయకలు కానీ సహాయం చేసి వాళ్ళని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు..
Read Also…
Read Also…
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 21 డివిజన్ లో ఉన్న రోడ్లపై మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం రద్దీగా ఉండే బిఆర్టిఎస్ రోడ్ లోని పలుచోట్ల రోడ్లను మరమ్మత్తు చేయాలని డిమాండ్ చేశారు నిత్యం ఈ రోడ్లో ప్రయాణించే వాహనాలు రోడ్డు ప్రమాదాలు గురై ఎందరో ప్రజలు ప్రాణాలు బలి తీసుకుంటున్నారని తెలిపారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే విష్ణు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రోడ్లను మర మత్తులు చేసేంతవరకు మా పోరాటం ఆగదని తెలిపారు
ఈ కార్యక్రమంలో టిడిపి నుంచి రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు జనసేన నుంచి పోలిశెట్టి రవి సెంట్రల్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు
ఆరుగాలం కష్టపడే రైతులకు అన్ని కష్టాలే. దుక్కి దున్నినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు అహర్నిశలు కష్టపడుతున్నా ఫలితం దక్కడం గగనమై పోతోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు పంట పొలాలను నాశనం చేస్తున్నాయి. భామిని మండలం భామిని గ్రామ సమీపంలోని పొలాల్లో ఏనుగులు సంచరిస్తూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఏనుగుల దాటికి భయపడి పొలం పనులకు వెళ్లేందుకు కూడా గ్రామస్తులు జంకుతున్నారు. ఏళ్ల తరబడి ఏనుగులు వచ్చి పంట పొలాలను ధ్వసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల బారి నుంచి కాపాడాలని అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏజెన్సీ రైతాంగం మండిపడుతోంది.
పార్వతీపురం మన్యం జిల్లాలోని టిడిపి కార్యాలయంలో జనసేన, టిడిపి ఆత్మీయ కలయిక సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టిడిపి ఇన్చార్జ్ బోనుల విజయచంద్ర, జనసేన ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త లోకం మాధవి, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, పార్వతిపురం జనసేన సమన్వయకర్త ఎ. మోహన్ హాజరయ్యారు. ముఖ్య నాయకులు ఆధ్వర్యంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు హాజరై ఉమ్మడి కార్యాచరణ పై చర్చించారు. లోకం మాధవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను తిప్పుకొట్టడానికి ఇరు పార్టీలో నాయకులు సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో రాక్షసి పాలనను అంతమొందించడమే లక్ష్యంగా ఉమ్మడి కార్యాచరణ చేస్తాం. బోనెల విజయ్ చంద్ర మాట్లాడుతూ ఇరు పార్టీల అగ్ర నాయకులు నిర్ణయించిన విధంగా ఉమ్మడి కార్యాచరణ ప్రజల్లోకి తీసుకెళ్లే వైసిపి నియంత పాలనకు చరమగీతం పాడుదాం. ఐక్యంగా ముందుకెళ్తూ పార్వతిపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం.




Total views : 62287