కర్నూలు జిల్లా పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ నుంచి ప్రత్యేక అవసరాలు గల చిన్నారులకు ఉపకరణాల అందజేత వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం 61 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి పేదలకు 5 రూపాయలకే భోజనం అందించే సేవను ప్రారంభించారు.
( ) పత్తికొండ అంబేద్కర్ సర్కిల్లో నిర్మించిన అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే కేఈ శ్యాం కుమార్, ఉడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్రతో కలిసి ప్రారంభించారు. కేవలం 5 రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం అందించడం ప్రభుత్వ సంక్షేమానికి నిదర్శనమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను మరింత విస్తృతంగా అమలు చేస్తామని, ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని తెలిపారు.