రష్యా పర్యటనలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ స్పీడ్ పెంచారు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మాస్కోలో ఆయన కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాకు చెందిన ప్రముఖ ‘స్బేర్ బ్యాంక్’ వైస్ ప్రెసిడెంట్ అల్బర్ట్ యెఫిమోవ్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో సాంకేతిక, ఆర్థిక రంగాల విస్తరణపై కీలక చర్చలు జరిపారు.స్బేర్ బ్యాంక్‌కు చెందిన ‘గిగావాట్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్’ సేవలను భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తరించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. అలాగే సైబర్ నేరాల నియంత్రణకు గానూ ‘యాంటీ-ఫ్రాడ్ నెట్‌వర్క్’ కోసం సాంకేతిక సహకారం అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీటితో పాటు ఏపీలోని ఫార్మా, అగ్రి ఎక్స్‌పోర్టర్లకు వ్యవస్థీకృత రుణాలు అందించేలా చొరవ చూపాలని లోకేష్ కోరారు. ఏపీని టెక్నాలజీ హబ్‌గా మార్చేందుకు రష్యా బ్యాంకింగ్ దిగ్గజం సహకారం అందించాలని ఆయన ఆకాంక్షించారు.
రష్యా పర్యటనలో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ..
36
previous post




Total views : 92029