సైదాపుర్ మండల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay Comments)..
సైదాపుర్(Saidapur) అంటేనే పువ్వు గుర్తు. కమ్యునిస్టులు,కాంగ్రెస్ ఉన్నా ప్రజలంతా బీజేపీ వైపు ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లాడిన బీజేపీ కి ఓటు వేయకుండా కాంగ్రెస్ కి ఓటేశారు. ఈ సారి అలా చేయకండి దయచేసి మళ్ళీ ఎంపిగా పోటి చేయమని నడ్డా గారు మోదీ గారు మరోసారి ఎంపిగా మాజీ ఎమ్మెల్యే శోభక్క, నాతో పాటు పార్టీ కార్యకర్తలు మీ కోసం కొట్లాడి జైలుకు పోయినం. పేదల కోసం కోట్లాడిన బీజేపీ ను వదిలేసి మీరు కాంగ్రెస్ కి ఒట్లేశారు. హుస్నాబాద్ నియోజవర్గం కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు గ్రామ పంచాయతీకి నిధులు కేంద్రం ఇచ్చింది. కేసిఆర్(kcr) తెలంగాణను అప్పుల పాలు చేసిండు. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. కాంగ్రెస్ వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలి.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
100 రోజుల లోపల ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు 80 రోజులు పూర్తయిన హామీలు మాత్రం అమలు కాలేదు
- గ్యాస్ కనెక్షన్ మహిళల పేరుతో ఉంటేనే ఆరు గ్యారంటిలు అమలు అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలు పెట్టింది.
- నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు.
- 10 రోజుల్లో ఎన్నికల కోడ్ వస్తుంది. మళ్ళీ ఓటేయండి ఆరు గ్యారెంటీలు ఇస్తాం అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామా మొదలూపెడుతుంది.
- చాయ్ అమ్ముకునే వ్యక్తి ప్రధాని అయ్యాడు కాబట్టే పేదోళ్ళకు న్యాయం జరగుతుంది
- మీరు ఎప్పుడైనా రామ మందిర ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని అనుకున్నారా?
- నరేంద్ర మోడీ హయాంలో రాముడి గుడి కట్టారని మీ తరతరాలు చెప్పుకుంటారు.
- రాముడు,ఉన్నాడు రాముడి నీ పూజించే మోదీ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ప్రధాని అభ్యర్ధిగా ఎవరు ఉన్నారు?
- పువ్వు గుర్తుకు ఓటేస్తే సంక్షేమం జరుగతుంది. కాంగ్రెస్ కి ఓటేస్తే ఉన్న రేషన్ కూడా పోతుంది
- దయచేసి మోడీని గెలిపించండి.
- మీరు ఎంపిగా గెలిస్తే 150 రోజుల్ పాటు పాదయాత్ర చేసిన. పేదల కోసం కోట్లాడిందుకు 100 కేసులు పెట్టారు.
- మా జీవితాలను , కుటుంబాలను ఆగం చేసుకొని కొట్లాడం.దయచేసి అర్థం చేసుకొని పువ్వు గుర్తుకు ఓటేసి నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేయండి
- యాత్రలో ఎక్కడికి వెళ్లినా మహిళలంతా మోదీ గారికి ఓటేస్తామని బహిరంగంగా చెబుతున్నారు.
- మరోసారి మీరంతా ఆశీర్వదించి నాకు ఓటేస్తే నేను వెళ్లి మోదీ గారికి ఓటేస్తా..
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి