Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Andhra Pradesh విశాఖ ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..

విశాఖ ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..

by Satya
Jagan mohan reddy6

విశాఖపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌లో బోట్లు దగ్ధమైన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో బాధితులను ఆదుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రమాదంపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. సీఎం జగన్‌ ఆదేశాలతో ఘటనా స్థలానికి చేరుకున్నారు మంత్రి సీదిరి అప్పల రాజు. విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్ని ప్రమాద ఘటనలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అగ్ని ప్రమాద ఘటన సందర్బంగా ఓ యూట్యూబర్‌ అక్కడ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, సదరు యూట్యూబర్‌పై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు. రాత్రి ఫిషింగ్‌ హార్బర్‌లో పార్టీ ఏర్పాటు చేసిన యూట్యూబర్‌. పార్టీలో మద్యం మత్తులో గొడవ జరిగినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో, పరారీలో ఉన్న యూట్యూబర్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

039533
Total views : 198328

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: