Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Latest News కాంగ్రెస్‌ పార్టీకి పేదప్రజలకు సేవ చేసే ఉదారత్వం ఉంది

కాంగ్రెస్‌ పార్టీకి పేదప్రజలకు సేవ చేసే ఉదారత్వం ఉంది

by CVR NEWS

కాంగ్రెస్ పార్టీకి పేద ప్రజలకు సేవచేసే ఉదారత్వం ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరయ్యారు. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు బాగుండాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ అని ఆయన పేర్కొన్నారు. పార్టీ పరంగా పటాన్ చెరు నాయకత్వం ఎంతో సేవలు చేసింది, వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందన్నారు మంత్రి. విద్య, వైద్య రంగాలలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో పనిచేస్తున్నామన్నారు.
పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతాన్ని ఇందిరా గాందీ గుర్తించి ఎన్నో ప్రతిష్టాత్మక పరిశ్రమలను నెలకొల్పారని ఆయన కొనియాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కందిలో త్రిబుల్ ఐటిని నెలకొల్పారని మంత్రి గుర్తు చేశారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: