Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Telangana బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

by CVR NEWS

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రస్తుత పరిస్థితి, గత ఎన్నికల్లో ఓటమి, సోదరి కవిత వైఖరిపై ఆయన ఆసక్తికరంగా స్పందించారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కవితను కేటీఆర్‌ విమర్శించారు. కవిత కన్నవారికి మేలు చేయకపోయినా ఫర్వాలేదని.. కానీ ఏడిపించొద్దంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కవిత వల్ల కన్నవారు, కుటుంబ సభ్యులు బాధపడుతున్నారని అన్నారు. జైలుకు వెళ్లొస్తే ముఖ్యమంత్రి అవుతారనుకోవడం వట్టి భ్రమేనని కేటీఆర్‌ అన్నారు. అలాగే బీఆర్‌ఎస్‌ తాజా పరిస్థితిపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌గా మారాక తాము తీవ్రంగా నష్టపోయామని… అందుకే మళ్లీ టీఆర్ఎస్‌గానే మారి ప్రజల్లోకి వెళ్తామని చెప్పారు. అలాగే గత పాలన సమయంలో కార్యకర్తలకు, నాయకులకు మధ్య దూరం చాలా పెరిగిందని… దాని వల్లే ఎన్నికల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విషయంలో టీడీపీలో చాలా మంచి లక్షణం ఉందని.. ఆ పార్టీ అధినేత కార్యకర్తలతో దగ్గరగా ఉంటారని కేటీఆర్‌ కితాబిచ్చారు. అలాగే పొత్తుల అంశం తమకు ఎప్పుడూ కలిసి రాలేదని… అందుకే భవిష్యత్తులో ఎవరితోనూ.. ముఖ్యంగా BJP తో పొత్తు అసలే ఉండదని కేటీఆర్‌ చెప్పారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు 2027 లో పాదయాత్ర చేస్తానని… తారకరామారావు చెప్పుకొచ్చారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: