Saturday, June 13, 2026
News Navigation
Saturday, June 13, 2026
News Navigation

Breaking

Saturday, June 13, 2026
Home Latest News సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి భూమిపూజ ..

సిద్దిపేట జిల్లా నర్మెట్టలో ఆయిల్‌పాం ఫ్యాక్టరీకి భూమిపూజ ..

by CVR NEWS

సిద్దిపేట జిల్లా నుంగనూర్ మండలం నర్మెట్ట గ్రామంలో జూనో జొలే బయో ఫుయిల్స్ కు మంత్రి శ్రీధర్ బాబు, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ హన్మంత రావు, తదితరులు పూజ చేశారు. ఆయిల్ ఫామ్ ప్రారంభమైన కొద్ది రోజులకే మరో ఫ్యాక్టరీ ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు శ్రీధర్‌బాబు. సీఎం రేవంత్ రాష్ట్రంలోని యువతకు ఉపాధి కావాలని ఎన్నో పరిశ్రమలు తీసుకువచ్చారు. ఫ్యాక్టరీలు రావడం వల్ల గ్రామాలు అభివృద్ధి చెంది యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. అప్పటి ప్రభుత్వమైనా ఇప్పటి ప్రభుత్వమైనా ప్రజలకు, యువత కు ఉపాధి కోసం ప్రయత్నం చేసాము.. చేస్తామన్నారు. అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన ఇంట్లో గ్యాస్ కొరత ఏర్పడుతుందని అందుకే ఇలాంటి పరిశ్రమలు స్థాపించడం వల్ల కొంత ఐనా మేలు జరుగుతుందన్నారు. డిసెంబర్ లోపు ఈ పరిశ్రమ నుంచి ఉత్పత్తి ప్రారంభం కావాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. ప్రభుత్వం తరపున ఏ అవసరం వచ్చినా మేము ఎప్పుడు ముందు ఉంటామన్నారు. మాకు బేషజాలు లేవు ఎక్కడ పరిశ్రమల పెట్టిన మేము సహాయం చేస్తామని శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

023210
Total views : 141508

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.