Saturday, July 11, 2026
News Navigation
Saturday, July 11, 2026
News Navigation

Breaking

Saturday, July 11, 2026
Home Latest News యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత…

by CVR NEWS
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కబేళాలకు తరలిస్తున్న ఆవుల పట్టివేత

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అక్రమంగా కబేళాలకు తరలిస్తున్న ఆవులను పట్టుకున్నారు పోలీసులు. రాజమండ్రి నుంచి బహదూర్‌పురా కబేళాకు తరలిస్తుండగా పట్టుకున్నారు. పైన సిమెంట్‌ బ్రిక్స్‌ను అమర్చి కిందిభాగంలో ఏర్పాటుచేసిన బాక్సుల్లో ఆవులను తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పోలీసులకు సమాచారమందించడంతో చౌటుప్పల్‌ దగ్గర వాహనాన్ని ఆపి తనిఖీలు చేశారు. సిమెంట్‌ బ్రిక్స్‌ కింద ఎవరికీ కనిపించకుండా డీసీఎం వెనుకభాగంలో 23 ఆవులను తరలిస్తున్నట్టు గుర్తించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు..ఆవులను గోశాలకు తరలించారు.

Advertisements

You may also like

Our Visitor

039595
Total views : 198654

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: