Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home Devotional భద్రాద్రి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం.

భద్రాద్రి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం.

by CVR NEWS
భద్రాద్రి ఆలయ విస్తరణ పనులకు శ్రీకారం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో విస్తరణ, అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని బేడా మండపం నుంచి ప్రస్తుతం ఉన్న ఉత్తర ద్వారం వరకు ఆలయాన్ని రెండు ప్రాకారాలుగా విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ తక్కువగా ఉన్న సమయంలో 54 ఏళ్ల చరిత్ర కలిగిన ఉత్తర ద్వారాన్ని తొలగించారు. ఉత్తరం వైపున భారీ నిర్మాణాలు చేపట్టనున్న నేపథ్యంలో ఇప్పటికే భూసార పరీక్షలను కూడా పూర్తి చేశారు.
డిసెంబర్ 10 నుంచి 30 వరకు జరగనున్న శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలకు ముందే ఉత్తరం వైపు అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులు, కాంట్రాక్టర్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.భద్రాచలంలో తొలినాళ్లలో వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారు దక్షిణ ద్వారం ద్వారా భక్తులకు దర్శనమిచ్చేవారు. అనంతరం 1972లో అప్పటి దేవస్థాన చైర్మన్ అల్లూరి మూర్తిరాజు ఆధ్వర్యంలో ఉత్తర ద్వారాన్ని నిర్మించారు. కేవలం 45 రోజుల్లో పూర్తయిన ఈ ద్వారం అప్పటి నుంచి ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది.అలాగే 2010లో నిర్మించిన ఇనుప ఫుట్‌బ్రిడ్జిని కూడా అభివృద్ధి పనుల కోసం పూర్తిగా తొలగించారు. కొత్త నిర్మాణాలతో భక్తులకు మరింత విశాలమైన, సౌకర్యవంతమైన దర్శన ఏర్పాట్లు కల్పించేందుకు దేవస్థానం చర్యలు చేపడుతోంది.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: