Wednesday, July 15, 2026
News Navigation
Wednesday, July 15, 2026
News Navigation

Breaking

Wednesday, July 15, 2026
Home Latest News నిర్మల్ జిల్లా కేంద్రంలో ముగిసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ముగిసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం.

by CVR NEWS
నిర్మల్ జిల్లా కేంద్రంలో ముగిసిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కోలాహలంగా సాగింది. జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా కలెక్టర్ స్వయంగా బాధితుల వద్దకు వెళ్లి, వారి అర్జీలను స్వీకరించారు. ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి, గడువులోగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఇదిలా ఉండగా.. కలెక్టరేట్ ప్రాంగణంలో దళిత సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని జిల్లాలో పూర్తిస్థాయిలో అమలు చేయాలంటూ కార్యాలయం ముందు బైఠాయించారు. అర్హులైన దళిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకారుల వద్దకు చేరుకున్న జిల్లా విద్యాశాఖాధికారి పథకం అమలుపై సానుకూల హామీ ఇవ్వడంతో దళిత సంఘాలు శాంతించాయి.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

040417
Total views : 207702

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: