మనమంతా కాలంతో పాటు పరుగెడుతూ మన చుట్టూ ఎన్నో వింతలు, విశేషాలను చూడలేకపోతున్నాం. చరిత్రకు సజీవ సాక్ష్యాలు ఉన్న వాటి గురించి తెలుసుకోలేకపోతున్నాం. అలాంటి వాటిలో ఈ ఆలయం కూడా ఒకటి. దాదాపు ఏడు వందల ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం ఇది. వందల ఏళ్లైనా చెక్కు చెదరని నిర్మాణాలు దీని సొంతం. ఎక్కడా లేని విధంగా 700 ఏళ్లుగా నిరంతరం వెలుగుతున్న అఖండజ్యోతి ఈ ఆలయం ప్రత్యేకత.నిజాం పాలనలో నిర్విఘ్నంగా పూజలు సాగిన ఆలయం. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో అతి పురాతనమైన సీతారామాలయం.తెలంగాణ ప్రాంతాన్ని అనేక రాజవంశాలు పరిపాలించాయి. వారి పాలనకు గుర్తులుగా ఆయా ప్రాంతాల్లో పలు దేవాలయాలను అప్పటి రాజులు నిర్మించారు. అలాంటి ఆలయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట లోని అతి పురాతనమైన సీతారామాలయం ఒకటి. కాకతీయ పాలకుల కాలంలో దాదాపు క్రీస్తు శకం 1333లో నిర్మితమైన ఈ దేవాలయానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఆలయంలో పురాతన లక్ష్మణ సమేత సీతారాముల మూల విగ్రహంతో పాటు 16 రాతి స్తంభాలతో నిర్మించిన కళ్యాణమంటపం, గంట, తటాకం నాటి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఆలయంలోని గంటపై ఆలయ నిర్మాణానికి సంబంధించిన సంవత్సరం చెక్కబడి ఉంది. ప్రతాపరుద్రుని కాలంలో నిర్మాణం. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయుల రాజ్యంలో కొన్ని గ్రామాలను పాలన పరంగా ప్రత్యేక గుర్తించేవారు. అలా గుర్తించిన వాటిలో గంభీరావుపేట ప్రధాన కేంద్రంగా ఉండేది. అందుకే అక్కడ ప్రత్యేకంగా లక్ష్మణ సమేత సీతారామాలయాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయ రాజులలో చివరివాడైన ప్రతాపరుద్రుని కాలంలో ఈ సీతారామాలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. నిజాం పాలనలో లింగన్నపేట సంస్థానానికి చెందిన శ్రీ వెంకటరావు దేశాయి సంస్థానాధీశులుగా ఉండేవాడు. ఈ ఆలయం పరిపాలన ఆయన కిందకి రావడంతో సీతారామాలయం అభివృద్దికి కృషి చేసినట్లు స్థానికులు చెబతుంటారు. ఆలయంలో పూజ కార్యక్రమాల కోసం దగ్గర్లోనే వెంకటాద్రి చెరువును నిర్మించారు. ఆ చెరువు నుంచే ఆలయంలో జరిగే ఉత్సవాల అన్నింటికీ నీటిని తెస్తుంటారు. ఇప్పటికీ ఆ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. నిజాం పాలనలో నిర్విఘ్నంగా పూజలు ఆలయంలో నందాదీపం 700 ఏళ్లుగా నిరంతరంగా వెలుగుతూనే ఉంది. మూల విగ్రహాల ప్రతిష్ఠకు ముందే ఆలయంలో నందా దీపంను ప్రతిష్ఠించినట్లు తెలుస్తుంది. నాటి నుంచి నేటి వరకు ఈ దీపం వెలుగుతూనే ఉంది. నిజాం కాలంలో సైతం ఈ ఆలయంలో నిర్విఘ్నంగా పూజలు సాగినట్లు ఆధారాలున్నాయి. ఈ నందా దీపం వెలుగుతుండడం వల్లే గ్రామస్తులు ఐశ్వర్యం, ధాన్యం, సమృద్ధిగా కలుగుతుందని ఇక్కడి ప్రజలకు ప్రగాఢ విశ్వాసం.
Devotional
దీన్ని కృష్ణాబాయి ఆలయంగా పిలుస్తారు స్థానికులు. 17-18 శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలో చూడచక్కని కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది. కృష్ణాబాయి ఆలయానికి కిలోమీటరు దూరంలో ప్రసిద్ధి చెందిన పంచగంగ ఆలయం దర్శనమిస్తుంది. 4500 ఏళ్ల కిందటి ఈ కృష్ణుడి గుడి లో కృష్ణ, వేణి, సావిత్రి, కొయనా, గాయత్రి నదులు సంగమిస్తాయి నమ్మకం. ఈ గుడిలోని గోముఖం నుండి వచ్చే ధార ఆ ఐదు నదులూ ప్రతిరూపమని చెబుతారు. ఇక్కడికి ఏడాది పొడవునా భక్తులు వస్తుంటారు. గోముఖం నుండి బయటకు వచ్చిన కృష్ణా నది అతివేగంగా మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆగ్నేయ మూల నుండి నలభై ఐదు మైళ్ళ ప్రవహించి తర్వాత దక్షిణ మహారాష్ట్ర గుండా మరో పది మైళ్ళ సాగి వాణి నదిని కలుపుకుని కృష్ణవేణి నదిగా ఖ్యాతి చెందినది. తర్వాత దక్షిణ మహారాష్ట్రలో మరో 150 మైళ్ళు ప్రవహించిన కృష్ణనది కర్ణాటకలో కలుస్తుంది. కృష్ణ, వీణ, సావిత్రి, కోయనా, గాయత్రి ఈ ఐదు నదుల సంగమ ప్రదేశంలో నిర్మించిన ఆలయాన్ని ఇక్కడ చూడొచ్చు. ఆలయంలో గోముఖి విగ్రహం, శ్రీకృష్ణుని విగ్రహాన్ని చూడొచ్చు. ఈ ఆలయానికి ఉన్న విశిష్టత మూలంగా ఏడాది పొడవునా భక్తులు సందర్శిస్తుంటారు. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో దేవగిరి యాదవ్ రాజు సింఘండియో నిర్మించారు. తరువాత, 16 వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని మరాఠా చక్రవర్తి శివాజీ మార్చారు. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు కృష్ణుడి అందమైన విగ్రహంతో అలంకరించబడింది. ఈ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడింది మరియు అతని అందమైన విగ్రహాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణం, బ్రహ్మ, విష్ణు మరియు శివుని పై సావిత్రి శాపంతో దగ్గరి సంబంధం ఉంది. అవి ఇక్కడ కోయినా, కృష్ణ, వెన్నా నదిలోకి ప్రవహిస్తాయి. అయితే వెన్నానది కొంత దూరం ప్రవహించి కృష్ణానదిలో కలుస్తుంది. కృష్ణ, వెన్న ఈ రెండు నదులు కలిసి కృష్ణవేణి నదిలా ముందుకు ప్రవహించగా, కోయినా నది మహాబలేశ్వర్ కొండల్లో పుట్టి అందులో ఒక పాయ మహాబలేశ్వర్ వైపు వచ్చి కృష్ణా నదిలో కలుస్తుంది. మహబలేశ్వరం లోని కొండమీదున్న కృష్ణవేణి ఆలయంలో గోముఖం నుంచి వెలువడే నీటిధార సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక కృష్ణానది జన్మించిన స్థానం ఒక కొండ మొదలు లోనే ఒక ఎత్తైన చోట కొండ అంచు ఉంది. ఇది ఇలా ఉంటె ఆలయ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ఐదు తూములు లాంటి రంధ్రాలు ఉండగా, అవి ఒకదానికి ఒకటి ఆరు అడుగుల దూరంలో ఉన్నాయి. ఈ ఒక్కో రంధ్రం గుండా నీరు ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఐదు నదులు ఆలయానికి వెనుక వైపు ఉన్న కొండమీద నుండి ప్రవహిస్తూ వస్తూ, ఈ రంధ్రాల గుండా కాలువ లోకి చేరి ఒకే నదిగా ప్రవహిస్తాయి. అదే కృష్ణా నది ప్రవహిస్తుంది. దీనినే పంచగంగ అని అంటారు. అక్కడి గోముఖం నుండి జాలువారే నీటి ధారను పవిత్ర జలంగా భావించి, భక్తులు తలపై చల్లుకున్నారు. అక్కడి నుంచి కొంచెం దిగువకు వెళితే ఆలయాల కేంద్రంగా పేరుగాంచిన మహాబలేశ్వరం వస్తుంది. ఆ ప్రాంతాన్ని ‘ వై ‘ అనీ, ‘వాయి’ అనీ పిలుస్తారు. వాయిస్ దొడ్డ గణపతి మహాబలేశ్వరం తర్వాత కృష్ణమ్మ వాయి పట్టణం గుండా ప్రవహిస్తుంది. మహాభారత కాలంలో విరాట నగరంగా పిలిచిన ఈ పట్టణానికి ఆలయాల నగరంగా కూడా పేరుంది. మహాబలేశ్వర్ ఆలయం కనిపిస్తుంది. ఈ మందిరం నుంచి బయటకు రాగానే అక్కడ మనకి మహాబలేశ్వర్ ఆలయం కనిపిస్తుంది. ఇది అతి పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. గర్భగుడిలో మహాబలేశ్వర స్వామి శివలింగ విగ్రహ మూర్తి దర్శనం ఇస్తాడు. ఇలా ఎన్నో విశేషాలు ఉన్న ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వచ్చి పంచగంగని చూసి తరిస్తారు. ఆలయం సమీపంలో ఉన్న దుకాణాల్లో రంగురంగుల హ్యాండీక్రాఫ్ట్స్ ను కొనుగోలు చేయవచ్చు.
శిరిడీ సాయి నామం అపూర్వం, అద్భుతం, అసామాన్యం, అతి శక్తి వంతం. సాయి నామాన్ని నిరంతరం భక్తి శ్రద్ధలతో జపించే వారి సర్వ పాపాలు ప్రక్షాళన అవుతాయి. ఆ సాయినాధుని సన్నిధికి సత్వరం చేరుకోగలము. తెలిసీ, తెలియక మనము చేసిన పాపాలు నిశించి పోవాలంటే సాయి నామాన్ని పట్టుకోవడం ఒక్కటే చక్కని మార్గం. ఈ కలియుగంలో సర్వ పాపములు ప్రక్షాళన కావడానికి, భక్తి మార్గంలో పయనించి ఆ సాయినాధునిలో ఐక్యం కావడానికి, నిరంతరం మానవాళిని పట్టి పీడించే అరిషడ్వర్గముల నుండి విముక్తి కావడానికి అతి సులువైన మార్గం నామ జపం. నామ జపం చేస్తే ఇక ఏ యజ్ఞ యాగాదులు అవసరం ఉండదు. అతి సులభంగా ఆ భగవంతుని దర్శించగలము. ఎన్నో వేల జన్మలకు అపారమైన పుణ్యం చేసుకొని వుంటే తప్ప సాయిభక్తులం కాలేము. ఆ పరబ్రహ్మ స్వరూపమైన శిరిడీ సాయికి శిష్యులం కాగలిగాము అంటే కొన్ని వేల జన్మలలో మనం చేసుకున్న అదృష్టం అంటే అతిశయోక్తి కాదు. కాని మాయలో పడిపోయిన మనము ఈ విషయాన్ని గ్రహించలేక మామిడి పూత వలె మధ్యలోనే రాలిపోతున్నాం లేక గురువారం భక్తులు గా మిగిలిపోతున్నారు. మనకు ఆ భగవంతుడైన సాయి కేవలం గురువారం మాత్రమే గుర్తుకు రావడం నిజంగా మన దురదృష్టకరం. సాయి కేవలం కోరికలు తీర్చే యంత్రం గాని ఉపయోగించుకుంటున్నాం. సాయి భక్తులమైన మనము సాయి నుంచి కోరవలసింది భౌతికమైన ఐహిక పరమైన కోరికలు కాదు. కోరికలు కలుగని స్థిని ప్రసాదించమని. సాయి జీవితం నుండి తెల్సుకోవల్సిందే కరుణ, దయ, ప్రేమ, పరిపూర్ణమైన వైరాగ్యం, పాపభీతి కలిగి వుండడం. నిరంతరం సాయిని ధ్యానించు. నిరంతరం సాయి నామస్మరణ చేయు. నిరంతరం సాయి తో మాట్లాడు, జీవితాన్ని సాయి మయం చేసుకో.
Read Also..
Read Also..
బ్రహ్మ లింగేశ్వర స్వామిభారత దేశంలో ఎన్నో ఏండ్ల చరిత్రకలిగిన ప్రముఖ దేవాలయాలలో బ్రహ్మలింగేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటి.ఆ ఆలయంలో బ్రహ్మచే ప్రతిష్టింపబడిన శివలింగం ఉన్నందువల్ల ఈ ఆలయం చారిత్రక ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంతం బలి ఘట్టంగా పేరుగాంచింది. బ్రహ్మచే ప్రతిష్టింపబడిన ఈ శివలింగానికి ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినాన పూజా కార్యక్రమం అత్యంత ఘనంగా జరుగుతాయి. బ్రహ్మ లింగేశ్వర స్వామి హిరణ్యాక్షుని వెంటాడుతూ విష్ణువు వరాహ రూపంలో భూమిని చేరుకునే పయనించడం వల్ల ఆ సమయంలో బలి చక్రవర్తి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రసాదించిన శివలింగానికి అభిషేకం నిమిత్తం నీరు కావాలని విష్ణుమూర్తి కోరగా వరాహ రూపంలో ఉన్న విష్ణు. ఈ మార్గం గుండా నదిని ఏర్పడటంతో వరహానది గా పేరుగాంచి నట్లు చెబుతున్నారు. ఈనది ఉత్తర దిక్కుగా ప్రవహించడంతో ఉత్తరవాహినిగానూ, ఈ ప్రాంతం దక్షిణ కాశీగానూ చరిత్రలో నిలిచింది. ఉత్తర వాహినిలో స్నానం ఆచరించడం సర్వ పాప పరిహారంగా భక్తులు భావిస్తారు. బ్రహ్మ లింగేశ్వర స్వామిబ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం పూర్తిగా రాతితోనే నిర్మితమైంది. రాతి స్తంభాలు, పైకప్పులు సైతం రాతితో నిర్మించారు. వేల సంవత్సరాల క్రితమే ఈదేవాలయం పూర్తి స్థాయిలో నిర్మితమైనట్లు స్థానికులు చెబుతుంటారు. సుమారు 50 గజాల పొడవు, వెడల్పులతో ఉన్న కోనేరు మధ్యలో స్వామి ఆలయం నిర్మాణమై ఉంది. మధ్యలో సుమారు ఏడు అడుగులు చదరంగా గర్భగుడి, దాని చుట్టూ నాలుగు వైపులా ఆరు అడుగుల వెడల్పున వరండా, ముందు వైపు ధ్వజస్తంభం, గర్భగుడిపైన గోపురం దేవాలయ నిర్మాణ మైంది. కోనేరు గట్టు మీద నుంచి మధ్యలో ఉన్న ఆలయం వరకు 10 అడుగుల వెడల్పున వంతెన నిర్మించారు. బ్రహ్మ లింగేశ్వర స్వామిఇక్కడి ఆలయం త్రిశూల పర్వతంపై ఉంది. సమీపంలో విభూతి గనులు కూడా ఉన్నాయి. ఈ దేవాలయం దేవాదాయ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది.దేవాలయానికి గల ఆస్తులు నిత్య ధూప, దీప, నైవేద్యాలను సమకూర్చుతున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు తమకు తోచిన రీతిలో కానుకలు సమర్పించుకుంటారు. బ్రహ్మ లింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, అభిషేకాలు రుద్రాభిషేకాలు, ఏకవార అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. బ్రహ్మ లింగేశ్వర స్వామి ఈ శివలింగానికి ప్రతి సోమవారం భక్తులు వచ్చి అభిషేకాలు చేయించుకున్నారు. అలాగే ప్రతి ఏటా కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదినాన్న పూజ కార్యక్రమం అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఆయా పర్వదినాల్లో లక్షలాదిమంది ఉత్సవాలలో భక్తులతో కోలాహలంగా ఉంటుంది. ఆ దగ్గర భీమేశ్వరాలయం, నంది విగ్రహం కూడా ఉన్నాయి. ఇక్కడి అమ్మవారు రాజ్యలక్ష్మి. ఈ ఆలయం క్రీ.శ. మొదటి శతాబ్దం నుంచీ ఉన్నదనటానికి చారిత్రక ఆధారాలు ఇక్కడ దొరికిన నాణేలు. బ్రహ్మ లింగేశ్వర స్వామి తొట్టతొలుత ఈ క్షేత్రం పేరు తాంబ్రావ, తాంబ్రాప. క్రమంగా అది చేబ్రోలు అయింది.లోహ యుగపు మొదలులో ఇక్కడ తామ్ర లోహం చాలా విరివిగా దొరికేది.మొదట ఇక్కడ కుమార స్వామి గుడి, పూజ ఉండేవిట. అప్పట్లో చౌడేశ్వరి, గణపేశ్వర ఆలయం నిర్మించారు. తర్వాత భీమేశ్వరాలయం. ఈ భీమేశ్వరాలయం క్రీ.శ. రెండవ శతాబ్ది కి చెందినది. ఈ గుడికి జీర్ణోద్ధరణ ప్రక్రియ నిమిత్తం బాగు చేస్తుంది. రెండువేల ఏళ్ల సంవత్సరాల క్రితం శివలింగం నంది విగ్రహాలు బయటపడ్డాయి.
ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయమైన అమ్మవారి ఆలయం. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం. అలాంటి కట్టడాలను చూడడానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తుంటారు. ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ దేవాలయాల్లో అతి పురాతనమైంది బీహార్లో ఉంది. కైమూర్ జిల్లాలోని కౌరా ప్రాంతంలోని ముండేశ్వరీ ఆలయం ప్రపంచంలోనే అతి పురాతనమైందని చరిత్రకారుల అంచనా. మూడు, నాలుగు శతాబ్దాల కాలంలో దీన్ని నిర్మించారని చెబుతున్నారు. విష్ణు భగవానుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ ఆలయం సముద్ర మట్టానికి 608 అడుగుల ఎత్తులో ఉన్నది. ఈ ఆలయం చుట్టు పక్కల ప్రాంతాల్లో 625 సంవత్సరం నాటి శాసనాలు బయల్పడ్డాయి. ఇది వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ఆలయం అత్యంత పురాతనమైన ఆలయం అమ్మవారి ఆలయం. మరి భారతదేశంలోని పూజాదికాలు నిర్వహించే అత్యంత పురాతనఆలయాలలో ఇది ప్రధమంగా పేర్కొవచ్చు. క్రీ.శ. 105 లో నిర్మించిన భారతదేశంలోని మొట్టమొదటి దుర్గామాత శక్తి ఆలయం. ఈ ఆలయం ముండేశ్వరి అనే పర్వతం మీద వుంటుంది. ఇక్కడ అమ్మవారిని శక్తి రూపంలో పరమ శివుడిని కూడా పూజిస్తారు. దీనిని భారతదేశంలోని పూజాదికాలు జరపబడుతున్న అత్యంత పురాతన ఆలయంగా పేర్కొనవచ్చు. దుర్గా దేవి వైష్ణవి రూపంలోఇక్కడ ముండేశ్వరి మాత దర్శనమిస్తుంది. ముండేశ్వరి మాత చూడటానికి కొంత వరకూ వరాహి మాతగా కనిపిస్తుంది. ఇక్కడ అమ్మవారి వాహన మహీషి. అమ్మవారి దేవాలయం అష్టభుజి దేవాలయం. దక్షిణ దిశలో అమ్మవారి ప్రధాన ఆలయ ద్వారం ఉండటం గమనార్హం. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. దీనిని 100ఏడి లో నిర్మించారు. అంతకంటే ముందు దానిని 105 ఏడి లో నిర్మించి ఉంటారని దీనికి సంబంధించినవి ఆర్కియాలజికల్ వారి ఆధీనంలో వుంది. ఈ ఆలయం నగరశైలిలో నిర్మించబడి వుంది. ఈ ఆలయంలో అమ్మవారు 10 చేతులతో ఎద్దు పైన స్వారీ మహిషాసురమర్ధిని రూపంలో వుంటుంది. ఇక్కడ శివుడు కూడా 4ముఖాలతో వుంటాడు. రెండు రాతితో చేసిన పాత్ర ఎంతో విభిన్నమైన ప్రత్యేక శైలిని కలిగి ఉంటాయి. ఈ ఆలయంలో సూర్యుడు, వినాయకుడు, విష్ణుమూర్తి ప్రతిమలు కూడా వున్నాయి. ఆ కాలం నుండి ఇక్కడ పూజాదికాలనేవి కొనసాగుతూ రావడం అనేది ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. శతాబ్దాలు మారినా పూజ కార్యక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలోని మెట్టుపల్లి పట్టణంలో గల త్రిశక్తి దేవాలయం తూర్పు ద్వారానికి అడ్డుగా గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి గోడను నిర్మించారు.
ఉదయమే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గుడికి అడ్డుగా ఉన్న గోడను తొలగించి విచారణ చేపట్టారు. త్రిశక్తి దేవాలయ కమిటీ చైర్మన్ ద్యావనపల్లి రాజారామ్ మాట్లాడుతూ ఉదయం గుడికి వచ్చి చూసేసరికి అక్రమంగా గోడ నిర్మించి ఉందని, వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్, సిఐ గారికి సమాచారం అందించామని పోలీసుల ఆధ్వర్యంలో గోడను తొలగించారని, దేవాలయం ముందు ఉన్న ఖాళీ స్థలం అన్ని దేవాలయాలకు సంబంధించిందని ఎమ్మెల్యే గారు ఊరి పెద్దమనుషులు, పోలీసులు చొరవ తీసుకుని ఇలాంటివి మళ్ళీ పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు.
శ్రీశైలం క్షేత్రానికి మంగళవారం అయోధ్య రామమందిరం నుంచి శ్రీరాముని అక్షింతలు చేరుకున్నాయి. ఈ పరమ పవిత్రమైన శ్రీరాముని అక్షింతలకు స్థానికలు మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవి ప్రధానాలయం ముందుభాగంలో గంగాధర మండపము వద్ద అక్షింతలకు ప్రత్యేక పూజాదికాలు జరిపించి, క్షేత్రపరిధిలో కోలాహలంగా ఊరేగింపు నిర్వహించారు. రేపటి నుంచి ఈ నెల 15 వరకు ఇంటింటికీ శ్రీరాముని అక్షింతలను పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాగా శ్రీరాముని అక్షింతలు దేశంలోని నలుమూలలకు పంపిస్తున్న తరుణంలో శ్రీశైలం క్షేత్రానికి కూడా చేరుకోవడంతో తాముకూడా శ్రీరాముని అక్షింతలు పొందుతున్నామని స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. రేపు ఉదయం పాతాళగంగ ఆంజనేయస్వామి ఆలయం నుండి అక్షింతలు పంపించేస్తామని తెలిపారు.
పూర్వం దక్షుడు తలపెట్టిన యాగానికి అల్లుడైనా పరమ శివుని పిలవడు. ఎందుకంటే ఏదో ఓ సందర్భంలో శివుడు తనని చూసి కూడా పలకరించకపోవడంతో దక్షుడు ఆగ్రహానికి గురవుతాడు. అందుకు ప్రతీకారంగానే ఆయన శివుడిని ఆహ్వానించడు. ఆహ్వానం ఉండకపోయినప్పటికీ శివుని సతి పార్వతీదేవి తన తండ్రి దక్షుడు తలపెట్టిన యాజ్ఞానికి వెళ్లగా అక్కడ ఆమెను ఎవ్వరూ పలకరించరు. అలాగే తన భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన పార్వతీ అప్పటికప్పుడే యోగాగ్నిలో దూకి తనువు చాలింది. అది తెలిసిన శివుడు సతీ వియోగాన్ని భరించలేక దక్షయజ్ఞను నాశనం చేయడం కోసం వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు. అదే సమయంలో సతీదేవిని తన శరీరం భుజాన వేసుకుని దుఃఖంతో పరిశ్రమించడం మొదలుపెడతాడు. లోక రక్షణ కోసం శివుడిని యథాస్థితికి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండిస్తారు. ఆ భాగాలు 101 ప్రదేశాలలో పడ్డాయి. ఆ భాగాల్లో తొలుత 56 ముఖ్యమైనవిగా పేరుగాంచాయి. కాలాంతరంలో 18 మాత్రమే ప్రముఖంగా నిలబడ్డాయి. వాటినే అష్టాదశ పీఠాలు అంటారు. అటువంటి వాటిలో శ్రీ మాధవేశ్వరీ దేవి ఆలయం ఒకటి. ఇక్కడ అమ్మవారి ముంజేయి పడింది. ఇక్కడ అమ్మవారి విగ్రహం ఏమీ వుండదు కానీ ఒక నలుచదరం పీఠంలాగా వుంటుంది. దానిపైన ఒక గుడ్డ హుండీ వేలాడదీసి నట్లుంటుంది. దానికింద ఒక ఉయ్యాల. భక్తులు తాము తీసుకెళ్ళిన కానుకలను ఆ ఉయ్యాలలో వుంచి మొక్కుకోవాలి. కాశీ తీర్ధయాత్ర చేసినవారు, ప్రయాగలో త్రివేణీ సంగమ స్నానం తప్పక ఆచరిస్తారు. అలాగే ఈ యాత్ర చేసినవారు గంగా తీర్ధం ఈ త్రివేణీ సంగమంనుంచి మాత్రమే ఇంటికి తీసుకు వెళ్ళాలి. ఇక్కడివారు శ్రీ మాధవేశ్వరీ దేవి అలోపీ దేవిగా వ్యవహరిస్తారు. అలా పిలవడానికి ఓ కథ ప్రచారంలో వుంది. పూర్వం ఒకప్పుడు ప్రయాగ ప్రాంతమంతా దట్టమైన అరణ్య ప్రదేశం. ఈ ప్రాంతంవారు ఆడపిల్లకి పెళ్ళిచేసి డోలీలో కూర్చోబెట్టి అత్తవారింటికి పంపిస్తారు. అలా ఒక పెళ్ళి కూతురుని పంపించేటప్పుడు బందిపోటు దొంగలు వారిని ఆపి దోచుకున్నారు. పెళ్ళికూతురు అమ్మవారిని ప్రార్ధించగా, ఆవిడ పెళ్ళికూతురుని మాయం చేసి, ఆ దొంగలబారినుండి రక్షించిందట. అప్పటి నుంచి ఆ దేవిని అలోపీ దేవి గా వ్యవహరిస్తున్నారు. అలోపీ అంటే మాయమవటం అని అర్ధం. అప్పటి నుంచి అక్కడివారు పెళ్ళిళ్లకు ముందు ఈ అమ్మవారిని పూజించి శుభకార్యం మొదలు పెడతారు.
Read Also..
Read Also..
మన భారతదేశంలో పరమశివుడు కొలువుదీరిన పంచభూతలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి. దీనిని ‘‘అన్నామలై’’ అని కూడా అంటారు. ఈ పుణ్యక్షేత్రంలో శివుడు ‘అగ్నిలింగం’ రూపంలో అరుణాచలేశ్వరుడిగా దర్శనమిస్తాడు. అరుణాచలం అనే పేరులో ఒక విశిష్ట తాత్పర్యము దాగి వుంది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ మొత్తంగా ఎర్రని కొండ అని అర్థం. దైవశాస్త్రాల ప్రకారం అరుణ అంటే పాపాలను సంహరించేది అని అర్థం. తమిళంలో దీనిని ‘‘తిరుణ్ణాములై’’ అని పిలుస్తారు. పంచభూతలింగ క్షేత్రాలలోనే ఈ క్షేత్రం ఎంతో పుణ్య, గొప్ప క్షేత్రంగా భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఈ క్షేత్రాన్ని ఒకసారి దర్శించుకుని, శివుడిని భక్తితో స్మరిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి, విముక్తి లభిస్తుందని వేదపండితులు కూడా నమ్ముతారు. అందువల్ల ఇక్కడికి విచ్చేసే భక్తులు కాశీ, చిదంబరం, తిరువారూరుల వంటి క్షేత్రాల కంటే ఎక్కువగా దర్శించుకుంటారు. ఈ ప్రాంతానికి, దేవాలయానికి సంబంధించి పురాణాలలో విశిష్టమైన కథలు కూడా తెలుపబడివున్నాయి. పురాణాల ప్రకారం పూర్వం శివుడు భూమిపై జరుగుతున్న పాపాలను, దుష్టకార్యాలను, అన్యాయాలను పూర్తిగా నిర్మూలించాలని కోరుకుంటాడు. దాంతో ఆయన విశ్వకర్మను ఈ అరుణాచలం ప్రదేశంలో స్వామివారి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు శివుని ఆజ్ఞను శిరసావహించి విశ్వకర్మ ఈ ఆలయాన్ని నిర్మించాడు. అలాగే ఆ ఆలయం చుట్టూ అరుణం అనే పురం కూడా నిర్మించబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. స్కాందపురాణంలో అంతర్గతమైన అరుణాలమహాత్యం ప్రకారం ఈ ఆలయంలో పూజావిధానం శివుని ఆజ్ఞ ద్వారా గౌతమ మహర్షి ఏర్పాటు చేశారని విశదీకరించబడింది. పురాణాలలో వున్న కథనాల ప్రకారం ఈ అరుణాచలం కొండను సాక్షాత్తూ శివుడు అని పేర్కోవడం ద్వారా ఈ కొండకు తూర్పు భాగంలో అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈ కొండకు అరుణాచలేశ్వరాలయం కంటే ఎక్కువ ప్రాధాన్యతను సంతరించుకుంది కూడా! ఇది శివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడుతుంది కాబట్టి దీనిని అగ్ని క్షేత్రమంటారు. సాక్షాత్తూ పరమశివుని జ్యోతిర్లింగాలలో ఒకటిగా చెప్పబడే ఈ అరుణాచలం చుట్టూ శివునిని భక్తితో స్మరిస్తూ ప్రదక్షిణం చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని, ఏకంగా శివునికే ప్రదక్షిణలు చేసేంత ప్రభావం లభిస్తుందని, పూర్వం మనం చేసిన పాపాలన్నీ తొలగిపోయి. కర్మల నుంచి విముక్తి పొందుతామని అప్పటి మహాత్ములు పేర్కొన్నారు. దీని ప్రాముఖ్యతను నలువైపులా విస్తరించడానికి శ్రీరమణులు కూడా పదేపదే ఉద్ఘోషించారు కూడా! అందువల్ల ఈ ప్రదేశంలో వేలాదిమంది భక్తులు నిత్యం గిరిప్రదక్షిణం చేస్తూ వుంటారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా ప్రారంభమైన భవానీ దీక్షా విరమణలు. ఐదు రోజులపాటు కొనసాగనున్న భవానీ దీక్షా విరమణ కార్యక్రమం. నాలుగు హోమగుండాలని వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేసిన ఆలయ అధికారులు అర్చక స్వాములు. నేతి టెంకాయలను సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్న భవానీ భక్తులు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో మారుమోగుతున్న ఇంద్రకీలాద్రి. కనుచూపుమేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి పోటెత్తిన భవానీ భక్తులు. ప్రత్యేక కౌంటర్లలో ఇరుముడులను సమర్పిస్తున్న భవానీలు. మూడు షిఫ్ట్ లలో 300 మంది గురు భవానీలు. కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. 20 లక్షల లడ్డూలను భవానీలకు అందుబాటులో ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు. గిరి ప్రదక్షణలో భవానీ భక్తులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు.