అన్నమయ్య జిల్లా రాయచోటి లోని శ్రీ భద్ర కాళీ సమేత శ్రీ వీరభద్ర స్వామి ఆలయం నందు రు.1.58 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న పశ్చిమ రాజగోపురం, సాలహరం నిర్మాణం శిలా ఫలకంను ప్రారంభించిన ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి… అదే విధంగా భక్తుల వసతి సౌకర్యార్థం రు.9.45 కోట్లతో రెసిడెన్షియల్ నిర్మాణానికి శిలాఫలకంను ప్రారంభించారు. బ్రహ్మోత్సవాలలో ఆలయం చుట్టూ స్వామి వారి రథం తిరిగేందుకు రు.38 లక్షలతో పూర్తయిన మాడ విధులను వారు ప్రారంభించి, అనంతరం అన్నదాన విరాళ కేంద్రాన్ని కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పోలం రెడ్డి విజయమ్మ, ఈఓ రమణా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ ఫయాజ్ బాషా, అన్నమయ్య జిల్లా దేవాదాయ శాఖ అధికారి, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Devotional
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేనివిధంగా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత గంగమ్మ తల్లిని భూమన కరుణాకర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మమత స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి ముని శేఖర్ రెడ్డి, తొండమనాటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
Read Also..
శబరిమలలో అయ్యప్పస్వామి భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని గంటసేపు పొడిగించింది. ప్రస్తుతం ప్రతిరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు. ఇకపై మధ్యాహ్నం 3 గంటల నుంచే దర్శనాలు మొదలై రాత్రి 11 గంటల వరకు కొనసాగుతాయి. రోజూ వర్చువల్ క్యూ ద్వారా 90వేల బుకింగ్‌లు, స్పాట్లో 30వేల బుకింగ్స్ ఉంటున్నాయని ఆలయ అధికారులు తెలిపారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలను త్వరత్వరగా సాఫీగా సాగేలా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులకు సగటున 14 గంటల టైం పడుతోంది. అయితే క్యూ కాంప్లెక్స్‌లో తగిన సౌకర్యాలు లేవని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో దర్శనం కోసం క్యూలో వేచి ఉండే భక్తులకు మంచినీరు, బిస్కెట్లను అందజేస్తామని ఆలయ అధికారులు తెలిపారు.
టాలీవుడ్ హీరో వెంకటేష్ ప్రస్తుతం సైంథవ్ సినిమాతో రాబోతున్నారు. ఈ మూవీ సంక్రాంతికి రానుంది. అందులో భాగంగా చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే టీజర్, మొదటి పాట కూడా వచ్చింది. ఈనేపథ్యంలో ఇప్పుడు రెండో పాటని విడుదల చేస్తున్నారు. విజయవాడలో ఈ మేరకు ఈ రోజు ఉదయం ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్‌కి వెళ్లిన సైంథవ్ టీమ్ విజయవాడ కనకదుర్గ టెంపుల్ని సందర్శించుకున్నారు. కనకదుర్గమ్మకి టీమ్‌తో కలిసి వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
పంచారామ క్షేత్రాలలో ఒకటైన కుమారస్వామి, భీమేశ్వర స్వామి ఆలయానికి టీటీడీ మాజీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాపిరాజు కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం చివరి సోమవారంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు సార్లు చైర్మన్ గా పనిచేయడం భగవంతుడిచ్చిన వరంగా భావిస్తున్నానని కనుమూరి బాపిరాజు అన్నారు.
అస్సాం రాష్ట్రంలో ఒక అద్భుతమైన ద్వీపం ఉంది. దీని విశేషాలు తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ద్వీపంలో పర్వమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిచినట్లు చెబుతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. అద్భుతమైన ప్రకృతి అందాలను అన్వేషించేందుకు ఈశాన్య భారతదేశం మీకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. పచ్చదనంతో నిండిన పర్వతాలు, రాతి మార్గాలు, రంగులతో మెరిసే వాతావరణం, బ్రహ్మపుత్ర నది, దాని సహజ అందాలు మీకు మరచిపోలేని అనుభవాలను పంచుతాయి. ఈ ప్రాంతంలో ప్రకృతి వికాసం అందమైన ఛాయాచిత్రాల మాదిరిగా వైభవంగా కనిపిస్తుంది. ఈశాన్య భారతదేశం అన్ని కాలాల్లో పర్యటించదగ్గ అద్భుతమైన ప్రదేశం. కాబట్టి వింటర్ లో విరామం కోరుకునే వారు ఎక్కడికి వెళ్లాలో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. ఈశాన్య ప్రాంతం సాహసాలకు కూడా స్వర్గధామం వంటిది. ప్రాచుర్యం పెద్దగా లేని కొన్ని అద్భుతమైన రహస్య ప్రదేశాలు ఇక్కడి పర్యాటకంలో ప్రత్యేక ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అస్సాంలోని ఉమానంద ద్వీపం. గొప్ప చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశం టూరిస్టుల దృష్టికి దూరంగా ఉంది. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అతి చిన్న నివాస ద్వీపం. ఈ నదీ ద్వీపంలో ఉన్న శివాలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఉన్న 5 ప్రముఖ దేవాలయాల్లో ఇది ఒకటి. కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి ముందుగా ఈ ఆలయాన్ని సందర్శించాలని భక్తుల నమ్మకం. బ్రిటిషర్లు ఈ ద్వీపాన్ని నెమలి ద్వీపం అని పిలిచేవారు. ఎందుకంటే ఇది నెమలి ఫించాల ఆకారాన్ని పోలి ఉంటుంది. ఎన్నో పురాణ గాధలు కూడా ఈ అరుదైన ప్రదేశం చుట్టూ అల్లుకుని ఉన్నాయి. పురాణ గాధల ప్రకారం ఉమానంద ద్వీపాన్ని ‘భస్మాచల్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు కామ దేవుణ్ణి తన మూడవ నేత్రంతో భస్మం చేశాడు. భస్మ అంటే బూడిద, చల్ అంటే స్థలం కామదేవుడు భస్మమైన ప్రదేశం కాబట్టి దీనికి భస్మాచల్ గా పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ద్వీపానికి మరో పురాణ కధనం కూడా ఉంది. పరమేశ్వరుడు తన సతీమణి పార్వతితో కలిసి ఇక్కడ నివాసం ఉండేవాడు. పార్వతి దేవిని ఉమాదేవి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఉమానంద అని పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ద్వీపం మునిగితే గౌహతి నీట మునుగుతుంది. ప్రసిద్ధ జానపద కధల ప్రకారం బ్రహ్మపుత్రను శివుని సేవకుడిగా పేర్కొంటారు. అస్సాంలో ఇటీవల కాలంలో బ్రహ్మపుత్ర నది కారణంగా అనేక సార్లు వరదలు సంభవించినా ఈ నదిపై ఉన్న ఉమానంద ఆలయంలోకి మాత్రం నీరు చేరలేదు. ఉమానంద ద్వీపం ఎప్పుడు నీట మునుగుతుందో అప్పుడు గౌహతి నగరం కూడా నీట మునుగుతుందని నమ్ముతారు. ఆలయ నిర్మాణం శివ భక్తుడైన గదాధర్ సింఘా అనే రాజు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడు. 1897లో ఏర్పడిన భూకంపానికి ఈ ఆలయం శిధిలమైంది. ఆ తరువాత ఒక స్థానిక వ్యాపారిచే దీనిని పునఃనిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో వినాయకుడు, విష్ణువు, సూర్య భగవానుడు, పార్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ఒక చిన్న కొండ ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
Read Also..
Read Also..
పవిత్ర కార్తీక మాసోత్సవాలు చివరి దశకు, చివరి కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని పట్టణంలోని శైవ క్షేత్రాలు శివ నామస్మరణలతో మారుమోగాయి. గుడివాడ పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానంలో తెల్లవారుజాము నుండే వేలాదిగా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు దేవాలయాలకు చేరుకోగా, వేద పండితులు స్వామి వారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పుణ్యస్నానాలు ఆచరించిన మహిళా భక్తులు దేవస్థాన ప్రాంగణంలో స్వామివారికి కార్తీకదీప పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు తీర్చుకున్నారు. స్వామి వారి ఆశీస్సులతో కార్తీక మాసోత్సవ వేడుకలు విజయవంతంగా ముగుస్తున్నాయని దేవదాయ శాఖ అధికారి నటరాజన్ షణ్ముగం అన్నారు.
కార్తీక మాసం ఆఖరి సోమవారం కావడంతో దక్షిణకాశీగా భాసిల్లుతోన్న ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచి వేలాదిమంది భక్తులు ఇక్కడకు విచ్చేసి సప్తగోదావరిలో స్నానమాచరించి. శ్రీ మాణిక్యాంబ అమ్మ వారిని, శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, శ్రీ స్వామివారి కి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భీమేశ్వర స్వామివారి ఆలయ ప్రాగణం శివనామస్మరణతో మారుమ్రోగింది. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి , మహిళలు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవాదాయ,ధర్మాదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణం లో కార్తీక మాస శుద్ద పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మందమర్రి మూడవ జోన్ రామాలయంలో ఘనంగా కార్తీకమాస దిపోత్సవం జరిగింది. kk5 మైన్ కార్మికుల మేనేజర్ ఆధ్వర్యంలో రామాలయం ‘కమిటీ పర్యవేక్షణ లో ప్రవక్త శ్రీ శ్రీ రామచంద్ర పండితుల శ్రీనివాస కల్యాణ మహోత్సవం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీనివాసా కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వారి ప్రత్యక్ష పర్యవేక్షణ లలో కార్తీక మాస దీపోత్సవం, శ్రీనివాస కళ్యాణం, మహా రుద్రాభిషేక మహోత్సవం వేదపండితులతో ఘనంగా జరిపారు. ఈ కార్తీక దీపోత్సవానికి పాల్గొన్న, పట్టణ మహిళలు ప్రజలు నాయకులు, సింగరేణి అధికారులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు, కార్తీక దిపోత్సవం లో పాల్గొన్నారు.