జాతకచక్రంలో కుజుడు బలహీనంగా ఉంటే తప్పకుండా రాగితో గానీ, ఎర్రటి మెటల్ తో చేసిన గణపతిని పూజించాలని పరిహారశాస్త్రం తెలియచేస్తుంది. ప్రతి మంగళవారం నియమంగా గణపతిని పూజించి, మోదకాలు పిల్లకు పంచిపెట్టాలి. కుజ దోషం వుంటే ధైర్యం లేకపోవుట, అన్న దమ్ములతో సఖ్యత నశించుట, భూమికి సంబంధించిన వ్యవహారాల్లో నష్టాలు, కోర్టు కేసులు, రౌడీల వలన ఇబ్బందులు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, పోలీసుల వల్ల వేధింపులు అప్పులు తీరకపోవుట, ఋణభాద తల ఒత్తిడి, రక్తానికి సంబంధించిన వ్యాధులు, శృంగారం నందు ఆసక్తి లేక పోవడం,కండరాల బలహీనత,రక్తహీనత, సమస్యలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవుట మొదలగునవి కలుగుతాయి. ఇలాంటివన్ని కుజ గ్రహ దోషముగా గుర్తించి కుజ గ్రహ అనుగ్రహం కొరకు సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయ స్వామి వారిని పూజించాలి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం, కందులు దానం చేయడం, పగడం ఉంగరం ధరించడం, మంగళవారం రోజున నియమంగా ఉండడం, అన్నదమ్ములకు సహాయం చేయడం, వారి మాటలకు విలువ ఇవ్వడం, స్త్రీలు ఎర్రని కుంకుమ,ఎరుపు రంగు గాజులు ధరించడం వలన కుజ గ్రహ పీడలు తొలిగిపోతాయి.
Devotional
ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనంగా వుంటాడో ఆ జాతకులు చంద్రగ్రహం అనుగ్రహం కోసం వెండి లేక పాలరాయితో చేసిన గణపతిని నియమంగా క్రమం
తప్పకుండా ప్రతి రోజు పూజించాలి. ఇక చంద్రగ్రహ దోషాలు వున్నప్పుడు మనస్సు నిలకడగా లేకపోవుట, భయం, అనుమానం, విద్యలో అభివృద్ధి లేకపోవుట, తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవుట, స్త్రీలతో విరోధము, మానసిక వ్యాధులు, రాత్రులు నిద్రపట్టకపోవుట, అధికమైన కోరికలు, శరీరం యొక్క ఎదుగుదల సరిగా లేకపోవుట, బరువు తక్కువగా ఉండుట, స్త్రీలకు గర్భాశయ వ్యాధులు మొదలగు సమస్యలు కలుతున్నప్పుడు చంద్ర గ్రహ దోషంగా గుర్తించి, చంద్ర గ్రహ అనుగ్రహం కొరకు మాతృ సమానమైన స్త్రీలను గౌరవించుట, బియ్యం దానం చేయుట, పాలు, మజ్జిగ వంటివి భక్తులకు చిన్న పిల్లలకు పంపిణీ చేయడం,
శివునికి ఆవుపాలతో అభిషేకం జరిపించుకొనుట, పార్వతీదేవి అష్టోత్తరం పారాయణం చేయుటం ద్వారా చంద్ర గ్రహ అనుగ్రహంతో అభివృద్ధి చెందుతారు.
సూర్యుడు ఎవరి జాతకంలో అయితే బల హీనంగా ఉంటాడో అలాంటి వారు సూర్యగ్రహ అనుగ్రహం కోసం ఎర్రపచందనంతో చేసిన గణపతిని ఆరాధిస్తే తప్పకుండా వారికి రవి గ్రహం శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక రవి గ్రహం అశుభుడుగా వున్న వారికి తీవ్ర అనారోగ్యము కలుగుతుంది, అధికారుల నుండి వేధింపులు, తండ్రి లేదా పుత్రుల నుండి వ్యతిరేకత, నేత్ర, గుండె సంబంధిత వ్యాధులు, తండ్రి తరుపు బంధువులతో పడకపోవుట, ఏదైనా సాధించాలనే పట్టుదల లేకపోవుట, ఆత్మ విశ్వాసం లేకపోవుట వంటి సమస్యలు తమ దైనందిన జీవితంలో ఎదుర్కొనేవారు సూర్య గ్రహ అనుగ్రహం కొరకు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకొనుట, ఆదిత్య హృదయం పారాయణం, గోధుమ లేదా గోధుమలతో తయారు చేసిన ఆహార పదార్థములు దానం చేయుట. తండ్రి గారిని
లేదా తండ్రితో సమానమైన వారిని గౌరవించుట వలన రవి గ్రహదోషము తొలగిపోయి అభివృద్ధి కలుగుతుంది.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి లో నేడు చంద్రగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూసివేసారు. కాని శ్రీకాళహస్తి ఆలయం మాత్రం నిత్యము జరిగే అభిషేక సేవలు, రాహు కేతు సర్ప దోష పూజలు యధావిధిగా కొనసాగుతున్నాయి. శ్రీకాళహస్తి ఆలయంలో గ్రహణ కాలము నందు స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకముగా గ్రహణ కాలాభిషేకం జరుగుతుంది. ఈ గ్రహణ సమయంలో గ్రహణ కాలాభిషేకంలో పాల్గొనడానికి భక్తులు అధికసంఖ్యలో తరలి వస్తారు.
ఏపీలోని ప్రముఖ దేవాలయాలు మూతపడనున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా ఆలయ తలుపులు మూసివేస్తారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయంతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. నేడు సాయంత్రం 6.30 గంటలకు అమ్మవారికి పంచహారతుల సేవ అనంతరం గుడి తలపులు మూయనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజలు చేస్తారు. ఉదయం 9 గంటల నుంచి దర్శనానికి అనుమతిస్తారు. సింహాచలం శ్రీ వరహాల లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నేడు మూతపడనుంది. ఈ రోజు ఉదయం 6.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని మూసివేయనున్నారు. 29 న ఉదయం 8 గంటల నుంచి భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఈ గ్రహణం కారణంగా ప్రముఖ ఆలయాలు మూతపడనున్నాయి. శనివారం రాత్రి ఆలయాలు తలుపులు మూయనున్నారు. మళ్లీ ఆదివారం తెల్లవారుజామున తలుపులు తెరుచుకోనున్నాయని అధికారులు తెలిపారు.
దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘనంగా దుర్గాపూజ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్‌కు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ దుర్గా పూజ కార్నివాల్‌ను వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నృత్య కళలు చూపరులను అలరించాయి. దుర్గాదేవికి సంబంధించిన ఓ భక్తి పాటకు పురుష, మహిళా కళాకారులు కర్రలపై నిలబడి చేసిన నృత్యం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్నివాల్లో ప్రదర్శించిన వివిధ కళలను మమతాబెనర్జీ ఆసక్తిగా తిలకించారు. పాటకు అనుగుణంగా తన ముందున్న టేబుల్‌పై రెండు చేతులతో లయబద్ధంగా కొడుతూ ఆమె ఎంజాయ్ చేశారు.
రాహుకేతువుల రాశి మార్పు వల్ల అనేకమంది వ్యక్తుల జీవితాల్లో తీవ్రమైన మార్పులు జరుగవచ్చు. గోచారం ప్రకారం ఈనెల 30వ తేదీన జరగనున్న రాహుకేతువుల రాశి మార్పుతో ప్రధానంగా మూడు రాశులు అత్యంత శుభాలను పొందబోతున్నాయి. గోచారం ప్రకారం రాహువు మేష రాశి నుంచి మీన రాశిలోకి, కేతువు తులా రాశి నుంచి కన్యా రాశిలో ప్రవేశిస్తారు. ఇది కొన్ని రాశులవారి అంతులేని లాభాలను కురిపించనుంది. ముఖ్యంగా మూడు రాశులవారు చేపట్టే ప్రతి పని సక్సెస్ అవుతుందనటంలో సందేహం లేదు. దాదాపు 18 నెలలు ఈ రాశులవారు రాజభోగాలను అనుభవిస్తారు. ఇప్పుడు ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం. వృషభ రాశివారు కెరీర్ పరంగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. తద్వారా ఆర్థికసమస్యలు తొలగి.జీవితం సుఖమయం అవుతుంది. వ్యాపారస్తులకు అధిక లాభాలు, వ్యాపార వృద్ధి , మరిన్ని ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణం లాభసాటిగా మారుతుంది. జీవిత భాగస్వామితో చక్కటి అనుబంధంఏర్పడుతుంది.
కర్కాటక రాశి వారు అభివృద్ధి చెందడానికి, అదనపు ఆదాయాన్ని ఆర్జించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. ధనలాభంతో ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. అదృష్టం తోడుగా ఉండటంవల్ల చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగనున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. గతంలో నిలిచిపోయిన ధనం చేతికందుతుంది. వివాహ యోగ్యత వుంది, ప్రేమలు ఫలిస్తాయి. వృత్తి, ఉద్యోగాదుల్లో మంచి అభివృద్ది సాద్యమవుతుంది. మీరనుకున్న కార్యక్రమాలు ఫలిస్తాయి. మేష రాశి వారి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వెతుకుంటూ వస్తాయి. వ్యాపారస్తులకు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తారు. కొత్త వెంచర్లకు అనుకూలం, నూతన గృహాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రతీ అవకాశాన్ని నూరు శాతం అందిపుచ్చుకుంటారు. ఇది దేవుడు మీకు ఇచ్చిన బంగారు అవకాశం. ఇక మిగిలిన రాసులుకొన్నింటికి చిన్న పరిహారాలతో అత్యంత మేలు కలుగుతుంది. వాటిలో ధనసు, సింహం, వృశ్చికం, మకరం రాశులకు కలసి వస్తుంది. మిగిలిన రాశులుతగిన పరిహారాలు తప్పక
చేయించుకోవాలి.
దేవుని ముందు పెట్టిన ప్రసాదాన్ని దేవుడు తింటే అది చూసి పులకించని భక్తులు ఉండరు.కానీ అల ఎక్కడైనా జరుగుతుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానము మంగళగిరి శ్రీ పానకాల నరసింహ స్వామి. ఈ విషయాన్ని వివరంగ తెలుసుకునే ముందు ఇక్కడి స్థల పురాణాన్ని కాస్త తెలుసుకుందాము. ఈ క్షేత్రం విజయవాడ మరియు గుంటూరు కు అతి చేరువలో ఉంది.విజయవాడ నుంచి ప్రతి 10 నిమిషాలకు గుంటూరు కు బస్సు సౌకర్యం కలదు. ఆ మార్గ మధ్య లోనే ఈ ఆలయం కలదు. మన రాష్ట్రము లోని అన్ని ప్రధాన పట్టణాల నుండి బస్సు లేదా రైల్ ప్రయాణం ద్వారా ఈ ఆలయాన్నిసులభంగా చేరుకోవచ్చు. మీకు ఈ ఆలయ సందర్శనార్ధం ఎలాంటి సమాచారాన్నైనా అందిచటానికి మా బ్లాగ్ సిద్ధంగా ఉంది. స్థల పురాణం ఇక్కడ రెండు రకాలైన కథలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో మొదటిది పూర్వం ఈ ప్రాంతాన్ని పారియాత్ర అను రాజు పాలించేవాడు.అతనికి సంతానము లేకపోవుటచే, సంతానం కొరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలను తిరిగగా అతనికి ఒక శిశువు జన్మించాడు.అతనికి హస్తసృంగి అని పేరు పెట్టాడు. కానీ దురదృష్టవసాత్తు అ పిల్లవాడు అంగవికలాంగుడిగా జన్మించాడు. ఆ రాజు తన పుత్రుని చూసి చాల విచారపడ్డాడు. తండ్రి బాధ చూసి హస్తసృంగి బాధాతప్త హృదయంతో అడవులకు వెళ్లి భగవంతుని సాక్షాత్కారం కోసం ఘోరమైన తపస్సు చేసాడు. అంతట శ్రీమహావిష్ణువు ప్రత్యక్షమవగా హస్తసృంగి తనకు తన జీవితాంతం భగవంతుని పాదాల చెంత ఉండాలని ఉండాలని చెప్పగా, శ్రీమహావిష్ణువు హస్తసృంగిని ఒక కొండగా మార్చివేసి దానిపై శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం లో కొలువయ్యాడు. అదియే ఇప్పటి పానకాల నరసింహస్వామి ఆలయం. మరియొక కథ కూడా ఈ ఆలయం గూర్చి ప్రచారం లో ఉంది. మహిషాసుర వధ జరిగిన తరువాత దుర్గమ్మ ఆగ్రహాగ్నితో రగిలిపోయింది. అప్పుడు ఆమె అగ్ని తన రెండవ కంటి ద్వార ఒక కొండపైకి వదిలి ఆ కొండను పెళ్ళగించి గాలిలోకి విసిరివేసింది. అదియె ఇప్పటి నరసింహ స్వామి కొలువైన కొండ.కాని దుర్గమ్మ నుంచి వెలువడిన ఆ అగ్నిజ్వాలలు మాత్రం ఆ కొండ నుండి అలాగే వెలువడుతున్నాయి. తరువాతి కాలంలో నరసింహ స్వామి హిరణ్యకసిపున్ని చంపిన తరువాత అలాంటి అగ్నిజ్వాలల తోనే రగిలిపోయాడు.అప్పుడు ప్రహ్లాదుడు ఆయనను స్తుతించగా ప్రసన్నుడై తన నుంచి వెలువడుతున్న అగ్నిజ్వలను తను అదుపుచేసుకోదలచి అనువైన ప్రాంతాన్ని వెతకుచున్న సమయంలో అప్పటికే అగ్నితో రగులుతున్న ఈ కొండ కనిపించి అక్కడే తనకు అనువైన ప్రాంతం అని తలచి నరసింహ స్వామి ఇక్కడే కొలువైయ్యాడు. కాని అగ్ని జ్వాలలు మాత్రం చల్లారలేదు. బ్రహ్మదేవుడు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ స్వామిని పానకంతో అభిషేకించగా అగ్నిజ్వాలలు పూర్తిగా ఆరిపోయాయి. అప్పటినుంచి ఇక్కడ పానకంతో అభిషేకించడం ఆనవాయితీగా మారింది. ఇక్కడ చెప్పుకోతగ్గ విశేషం ఏమిటంటే స్వామి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి నోటిలో పోస్తే నరసింహుడు ఆ పానకాన్ని గుటకలు వేస్తూ సంతోషంగా స్వీకరిస్తాడు.గుటకలు వేసిన శబ్దం కూడా స్ఫష్టంగా వినిపిస్తుంది.స్వామికి భక్తులు ఇచ్చిన పానకాన్ని అర్చకులు స్వామి కి అందివ్వగా స్వామి దానిని త్రాగి మరల కొంత పానకాన్ని బయటకు వదులుతాడు.దానినే భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు.మరియొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ నిరంతరం పానకం నైవేద్యం వల్ల అక్కడ పానకం నేలపై పడినా అక్కడ ఒక్క చీమ కూడా ఉండదు మరియు ఒక ఈగ కూడా వాలదు. భగవంతుడుకి ఇచ్చిన ప్రసాదాన్ని భగవంతుడే తింటే వచ్చే అలౌకిక ఆనందాన్ని భక్తులు సొంతం చేసుకుంటారు. ఇది ప్రతి తెలుగువాడు ఖచ్చితంగా చూడదగ్గ ప్రాంతం.
Read Also..
Read Also..
స + అష్ట + అంగ = సాష్టాంగ. అనగా 8 అంగములతో నమస్కారం చేయడం. అలా నమస్కారం చేసే సమయంలో ఈ శ్లోకం చదవాలి.
శ్లో !! ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా
పద్భ్యాం కరాభ్యాం కర్నాభ్యాం ప్రణామం సాష్టాంగ ఉచ్యతే !!
అష్టాంగాలు : ఉరసు అంటే తొడలు, శిరసు అంటే తల, దృష్టి అనగా కళ్ళు, మనసు అనగా హృదయం, వచసు అనగా నోరు, పద్భ్యాం – పాదములు, కరాభ్యాం – చేతులు, కర్నాభ్యాం – చెవులు. బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ నమస్కరించి ఆయా అంగములు నేలకు తగిలించాలి. స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేకూడదు.
కడప టౌన్ నుంచి ఒంటిమిట్ట 25km ఉంటుంది . శ్రీ కోదండరామ స్వామి ఆలయం ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయం ఒక రాయతో తాయారు చేయబడ్డాయి. రామ్, సీతా లక్ష్మణులు, విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ హనుమాన్ విగ్రహం ఉండదు. ఎందుకు అంటే.. గుడి కట్టినపుడు రాముడు ఆంజనేయ స్వామి ని కలవ లేదు. అందుకు అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉండదు. శ్రీ కోదండరామ స్వామి ఆలయం రామతీర్థం మరియులక్ష్మనతిర్థం వంటి ఇద్దరి నిత్యం కొలనులు ఉన్నాయి. పురాణ నుండి కొన్ని సంఘటనలకు రామాయణం మరియు మహాభారతం ఈ ఆలయం లోపల కళారూపంలో శృంగారమైన చేశారు. జానపద నమ్మకం ప్రకారం, గ్రామం రెండు వ్యక్తులు, కంపన రాజు సహాయం చేసిన వొంతోడు మరియు మిత్తోడు, నుండి దాని పేరు పొందింది. బదులుగా, రాజు వాటిని తర్వాత గ్రామం పేరు. సమయం కాలంలో, గ్రామం ఒంటిమిట్ట అనేవారు.



Total views : 212281