Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Health అలసట తగ్గాలంటే ఇలా చెయ్యండి..!

అలసట తగ్గాలంటే ఇలా చెయ్యండి..!

by Satya
Fatigue

శరీరం విశ్రాంతి లేకుండా పనిచేసినప్పుడు. మానసిక శ్రమ ఎక్కువైనప్పుడు అలసట అనే భావన కలుగుతుంది. ఏ పనిచేసినా వెంటనే అలసిపోతావు. నీకు రెసిస్టెన్స్ లేదు అనే మాటలను మనం తరచూ వింటూనే ఉంటాము. శరీరానికి సరైన పోషకాలు అందకపోతే అలసటగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ ఇలా చేయడం వల్ల మనం అలసట నుంచి బయటపడవచ్చు. శరీరం అలసటకు గురికాకుండా ఉండాలంటే నీరు బాగా తాగాలి. దీనివల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి, మెదడు చురుకుగా పనిచేస్తుంది. రోజులో కనీసం 8 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. దాహంతో సంబంధం లేకుండా. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయం పూట టిఫిన్ మానేయకూడదు. టిఫిన్ తినకపోవడం వల్ల త్వరగా అలసిపోతాము. ముందురోజు రాత్రి ఎప్పుడో భోజనం చేసి ఉంటాము. టిఫిన్ తినకపోవడం వల్ల మధ్యాహ్నం లంచ్ చేస్తాము. దీనివల్ల దాదాపు 16 నుంచి 17 గంటలు ఏమీ తినకుండ ఉండటం వల్ల శరీరం శక్తి హీనం అవుతుంది. దీనివల్ల అలసటగా ఉండి. ఏ పనిచేయలేము మధ్యాహ్న భోజనంలో తప్పకుండా కార్బొహైడ్రేట్లు , ప్రొటీన్లు ఉండే ఆహారమే తీసుకోవాలి. దీనివల్ల శరీరం చురుకుగా ఉంటుంది. అనవసర, అసందర్భ ఉపవాసాలు చేయడం అస్సలు మంచిదికాదు. ఏ వారానికోసారో, పదిరోజులకోసారో ఉపవాసం ఉంటే మంచిదికాని. వారానికి రెండు మూడు రోజులు ఉపవాసం చేయడం వల్ల శరీరం శుష్కించి పోయే ప్రమాదం ఉంది. అధికంగా తినడం కూడా అలసటకు కారణం అవుతుంది. ఎక్కువ కేలరీలు ఉండే ఆహారం తినడం వల్ల కొవ్వు పేరుకుపోయి. చురకుతనం తగ్గి ఆయాసం, అలసట వస్తాయి. తీసుకునే ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఐర‌న్ లోపం వల్ల ర‌క్త‌హీనత వస్తుంది. రక్తహీనత అలసటకు దారితీస్తుంది. చురకుతనం తగ్గుతుంది. అందుకే ఇనుము ఎక్కువగా వుండి, సులభంగా లభించే అన్ని రకాల తాజా ఆకుకూరలు రోజూ తీసుకోవడం వల్ల రక్తహీనత రాకుండా చూసుకోవచ్చు. కెఫిన్ ఉండే కాఫీ, టీ, శీతల పానీయాల‌ను త‌క్కువగా తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవడం వల్ల అల‌స‌ట, ఆందోళ‌న‌, చిరాకు పెరుగుతాయి.

Read Also..

Read Also..

Advertisements

You may also like

Our Visitor

009385
Total views : 62186

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.