Thursday, September 10, 2026
News Navigation
Thursday, September 10, 2026
News Navigation

Breaking

Thursday, September 10, 2026
Home Film విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ నుంచి మనసుని హత్తుకునే ‘అమ్మా అమ్మేగా’ పాట విడుదల..

విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ నుంచి మనసుని హత్తుకునే ‘అమ్మా అమ్మేగా’ పాట విడుదల..

by CVR NEWS
విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ నుంచి మనసుని హత్తుకునే ‘అమ్మా అమ్మేగా’ పాట విడుదల

విజయ్ ఆంటోని ‘వంద దేవుళ్ళు’ నుంచి మనసుని హత్తుకునే ‘అమ్మా అమ్మేగా’ పాట విడుదల.

విజయ్ ఆంటోని, శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’, అందులోని అమ్మ పాటకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇప్పటికీ      అమ్మ పాట అంటే అందరూ ఆ పాటనే ఎంచుకుంటారు. మళ్లీ అలాంటి ఓ ఎమోషనల్ మదర్ సాంగ్‌తో విజయ్ ఆంటోని, శశి          ఆడియెన్స్ ముందుకు వచ్చారు. వీరి కాంబోలో ‘బిచ్చగాడు’ తరువాత ‘వంద దేవుళ్ళు’ అనే సినిమా రాబోతోంది. ఇప్పటికే                 రిలీజ్   చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, టీజర్‌తో సినిమా మీద అంచనాలు ఆకాశన్నంటాయి.

ఇక తాజాగా ‘వంద దేవుళ్ళు’ నుంచి ‘అమ్మ అమ్మేగా’ అంటూ అమ్మ గొప్పదనం గురించి చెప్పే పాటను విడుదల చేశారు.                 వంద   దేవుళ్లే దిగివచ్చినా అని భాష్యశ్రీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశారో.. మళ్లీ ఇప్పుడు ‘అమ్మ అమ్మేగా’ అని                       అందరినీ       మెప్పించేందుకు వచ్చారు. ‘అమ్మ అమ్మేగా’ అనే ఈ పాటకి భాష్యశ్రీ సాహిత్యం, బాలాజీ శ్రీరామ్ బాణీ, శ్రీకాంత్           హరిహరణ్ గాత్రం అన్నీ అద్భుతంగా కుదిరాయి. ఈ పాటను వింటే అమ్మ విలువ ఏంటో మరోసారి అర్థం అయ్యేలా ఉంది.

విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద                         రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని,                   కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని         పోషించారు.

ఈ సినిమాకి ఎస్. బి. దర్శన్ కిర్లోష్ కెమెరామెన్‌గా, బాలాజీ శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పని చేశారు. హరిష్ యువరాజ్                     ఎడిటర్‌గా, భాష్య శ్రీ డైలాగ్ రైటర్‌గా వర్క్ చేశారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా మే నెలలో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: