Sunday, July 12, 2026
News Navigation
Sunday, July 12, 2026
News Navigation

Breaking

Sunday, July 12, 2026
Home Film భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

by CVR NEWS
భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న 'అగ్లీ స్టోరీ' విడుదల!

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే ‘అగ్లీ స్టోరీ’ ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘భీమ్లా నాయక్’ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సంగీత దర్శకుడు శ్రావణ్ భరద్వాజ్ స్కోర్ ట్రైలర్‌ను మరింత ఆకర్షణీయం చేసింది. ఉత్కంఠ, ఆందోళన, ఆకర్షణ మూడింటినీ సమానంగా కలిపి రూపొందించిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది. రియా జియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉండేలా సూచిస్తున్నాయి. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో మూవీ టీం సినిమా ఔట్ పుట్ పై సంతోషం వ్యక్తం చేసింది. సినిమా పట్ల తమ నమ్మకాన్ని తెలియజేసింది.

డైరెక్టర్ ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ, “ప్రతి ప్రేమకు ఓ చీకటి వైపు ఉంటుంది. ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం. నందు, అవికా నటన ఈ చిత్రానికి బలం చేకూర్చింది. మా ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు ఈ సినిమా క్వాలిటీ విషయంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా చూసి, ప్రేక్షకులు థియేటర్లలో మంచి అనుభవం పొందుతారు” అని తెలిపారు. అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.

హీరో నందు మాట్లాడుతూ, “ఈ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్‌తో నిండిన స్టోరీ ఇది. అవికా మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. డైరెక్టర్ ప్రణవ గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు అద్భుతమైన నిర్మాణ విలువలు అందించారు. ప్రేక్షకులు ఈ సినిమాని కచ్చితంగా ఆస్వాదిస్తారు” అని తన ఉత్సాహం చూపించారు.

అవికా గోర్ మాట్లాడుతూ, “ఈ చిత్రం ద్వారా ప్రేమ యొక్క వాస్తవాలను చూపించాలనుకున్నాం. ట్రైలర్ చూశాక చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. డైరెక్టర్ ప్రణవ గారికి, నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారికి రుణపడి ఉంటాను. మే 22న థియేటర్లలో కలుద్దాం” అని అన్నారు. అలాగే ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. డైరెక్టర్ ప్రణవ పనితనాన్ని.. నందు, అవిక ప్రదర్శనలను ఎంతగానో మెచ్చుకున్నారు. అలాగే ఈ మూవీకి మొదటి నుంచి ఎంతో సహకారం అందించిన బెక్కం వేణు గోపాల్ గారికి, ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీం చాలా కష్ట పడిందని, ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని అన్నారు. మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు.

సాగర్ కె చంద్ర మాట్లాడుతూ, ట్రైలర్ చాలా బాగుందని టీం ని కొనియాడారు. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

039801
Total views : 200863

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: