Sunday, May 17, 2026
News Navigation
Sunday, May 17, 2026
News Navigation

Breaking

Sunday, May 17, 2026
Home Film ఏప్రిల్ 12 న రోటి క‌ప‌డా రొమాన్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల

ఏప్రిల్ 12 న రోటి క‌ప‌డా రొమాన్స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల

by Rama
Roti Kapada Romance

రోటి క‌ప‌డా రొమాన్స్ (Roti Kapada Romance) సినిమాలోని నటులు

‘హుషారు, సినిమా చూపిస్త మావ, మేం వయసుకు వచ్చాం, ప్రేమ ఇష్క్ కాదల్, పాగల్’ వంటి యూత్ ఫుల్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance)’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. ఈచిత్రానికి సంబంధించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్ర‌తి ప్ర‌చార చిత్రానికి మంచి స్పంద‌న వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విడుదల‌ తేది ఖ‌రారు ప్రెస్‌మీట్‌ను బుధ‌వారం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ క‌థ‌ను న‌మ్మి ఎమోష‌న‌ల్‌గా ఫీల్ అయి చేసిన సినిమా ఇది. నేను మొద‌ట్నుంచి కంటెంట్‌ను న‌మ్మి సినిమాలు చేస్తూ వ‌చ్చాను. ప్రేక్ష‌కులు కూడా నాకు అన్ని విధాలా స‌పోర్ట్ చేశారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ క‌థ‌ను కూడా ఇష్ట‌ప‌డి, న‌మ్మి చేస్తున్న సినిమా ఇది. ఏప్రిల్ 12న చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నాం. త‌ప్ప‌కుండా చిత్రం జ‌నాద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం వుంది అన్నారు. ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ ద‌ర్శ‌కుడి కావాల‌న్న నా 15 ఏళ్ల క‌ల నాకు ఈ సినిమాతో తీరుతుంది. మొద‌ట్నుంచీ త‌న సంస్థ‌లో ప్ర‌తిభ‌గ‌ల న‌టీన‌టుల‌ను, సాంకేతిక నిపుణుల‌కు స‌పోర్ట్ చేసే వేణుగోపాల్ నాకు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా త‌ప్ప‌కుండా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం వుంది. అయితే క‌మ‌ర్షియ‌ల్‌గ ఏ రేంజ్ హిట్ అన్న‌ది మాత్ర‌మే ఇప్పుడే చెప్ప‌లేను. ఇది అంద‌రూ అనుకున్న‌ట్లు కేవ‌లం ఎంట‌ర్‌టైన్‌మెంట్ సినిమానే కాదు, అన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఈ చిత్రంలో వున్నాయి. ఇట్స్ ప్యూర్ ఫిలిం. లైఫ్‌లో ఒక్క‌సారైనా అంద‌రూ ల‌వ్ అనే ఎక్స్‌పీరియ‌న్స్‌ను చూసి వుంటారు. అలాంటి వారంద‌రికి మా సినిమా క‌నెక్ట్ అవుతుంది అన్నారు.

ఈ సినిమా అంద‌రికి న‌చ్చుతుంద‌ని, ఇది కేవ‌లం యూత్‌ఫుల్ సినిమానే కాదు అన్ని వ‌ర్గాల వారికి న‌చ్చుతుంద‌ని హీరోల్లో ఒక‌రైన హర్ష తెలిపారు. త‌మ మీద న‌మ్మ‌కం వుంచి చిత్రంలో న‌టించే అవ‌కాశం ఇచ్చినందుకు ద‌ర్శ‌క‌, నిర్మాత‌ల‌కు త‌మ థ్యాంక్స్ తెలియ‌జేశారు త‌రుణ్‌, సుప్ర‌జ్‌. ఈ స‌మావేశంలో కెమెరామెన్ సంతోష్ రెడ్డి, హీరోయిన్లు సోనూ ఠాకూర్‌, మేఘ‌లేఖ‌, ఖుష్బూ చౌద‌రి త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

ఇది చదవండి: ఆకట్టుకుంటున్న ‘లైన్ మ్యాన్’ మూవీ ట్రైలర్…

హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ మామిడి,
కొరియోగ్రఫీ: జేడీ మాస్టర్,
కాస్ట్యూమ్ డిజైనర్: అశ్వంత్‌ భైరి, ప్రతిభా రెడ్డి
అసోసియేట్ ప్రొడ్యూసర్: నాగార్జున వడ్డె,
డీఓపీ: సంతోష్ రెడ్డి,
సంగీతం: హర్ష వర్థన్ రామేశ్వర్, ఆర్ ఆర్ ధ్రువన్, వసంత్.జి
పాటలు: క్రిష్ణ కాంత్, కాసర్ల శ్యామ్, రఘురామ్

ఎడిటర్: విజయ్ వర్థన్
నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్‌ కుమార్ బొజ్జం
కథ, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: విక్రమ్ రెడ్డి


ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..
క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగి కర్టెన్ రైజర్ ఈవెంట్ శుక్రవారం హైదరాబాద్ లో …
చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..
నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్ట‌ర్‌ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి …
తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం..
తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో పర్సంటేజ్ విధానంపై 15 …

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Our Visitor

014176
Total views : 79487

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.