అమెరికాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూయార్క్ వేదికగా ప్రవాస తెలంగాణవాదులు పెద్ద ఎత్తున పాల్గొని రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల ఫ్యాషన్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ వేడుకల్లో ప్రముఖ ఎన్ఆర్ఐలు డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, వెంకట్ మారోజు, నారాయణస్వామి పాల్గొని తెలంగాణ రాష్ట్ర ప్రగతిపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మిమిక్రీ కళాకారుడు రమేష్, గాయకుడు అద్వైత్ బొందుగుల తమ ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు. అలాగే అశోక్ చింతకుంట ప్రదర్శించిన కొమరం భీమ్ ఏకపాత్రాభినయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చిన్నారులు నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకుంది.తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని, ఆ దిశగా ప్రవాస తెలంగాణవాదులు తమవంతు సహకారం అందిస్తామని నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల తెలిపారు.నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, సలహా సంఘం సభ్యులు కుటుంబాలతో సహా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.
న్యూయార్క్‌లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.
37




Total views : 92027