Friday, May 1, 2026
News Navigation
Friday, May 1, 2026
News Navigation

Breaking

>
Friday, May 1, 2026
Home Latest News ప్రియమిత్రునికి ప్రమాణ స్వీకార ఆహ్వానం..

ప్రియమిత్రునికి ప్రమాణ స్వీకార ఆహ్వానం..

by Rama
Revanth reddy

సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా తల్లికి పాదాభివందనం చేసి, ఆశీర్వాదాలు తీసుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీలో నిన్న పలువురు నేతలను కలిశారు. ఇందులో భాగంగా దీపేందర్ సింగ్ హుడా నివాసానికి వెళ్లారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని కోరారు. ఈ సమయంలో హుడా తల్లి… రేవంత్ రెడ్డికి తిలకం దిద్ది ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించి దీపేంద్ర సింగ్ హుడా ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎంపికైన తర్వాత తన ప్రియమిత్రుడు రేవంత్ రెడ్డి తన నివాసానికి చేరుకొని తనను ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారని పేర్కొన్నారు. నిజమైన స్వేహితుడిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చారని, సీఎం అవుతున్నప్పటికీ గతంలో కంటే ఆత్మీయత కనిపిస్తోందని పేర్కొన్నారు. రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన జరుపుతుందని బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు.

Advertisements

You may also like

Our Visitor

009365
Total views : 62014

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.