టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు పక్కా ఆధారాలు ఉన్నాయని… అన్ని ఆధారాలతోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పారు. ఆధారాలు ఉండటం వల్లే ఆయనకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదని అన్నారు. ఏ వయసులో తప్పు చేసినా నేరం నేరమేనని చెప్పారు. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోబోతున్నారని తెలిపారు.
చంద్రబాబు లక్కీ నెంబర్ 23 అని… తమ పార్టీకి చెందిన 23 మందిని ఆయన లాక్కున్నారని… 2019లో ఆయనకు వచ్చిన సీట్లు కూడా 23 అని… ఆయన జైలుకు వెళ్లిన తేదీ కూడా 23 అని అనిల్ ఎద్దవా చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై టీడీపీ నేతలే సైలెంట్ గా ఉన్నారని… తమ పార్టీ నుంచి వెళ్లిన ఎమ్మెల్యేలు మాత్రం లేనిపోని హడావుడి చేస్తున్నారని విమర్శించారు.
Latest News
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఐడీ చీఫ్ సంజయ్‌పై టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్ రూల్స్ అతిక్రమించి మరీ ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి తొత్తులా పని చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వైసీపీకి వత్తాసు పలుకుతున్న సీఐడీ చీఫ్ సంజయ్ పైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ మెప్పు కోసం ప్రతిపక్షాలపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. సీఐడీ చీఫ్ రాజకీయ పక్షపాతాలు లేకుండా పని చేయాలని, కానీ ఆయన అలా ఉండటం లేదన్నారు. ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే, విచారణ చేయకుండానే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్నారు. ఆయన కస్టడీ, బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై కోర్టుల్లో విచారణ సాగుతోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది.
చంద్రబాబుపై నమోదైన కేసులో తమ వాదనలు కూడా వినాలని అందులో కోరింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై చాలా ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. విద్యార్థులకు శిక్షణ ఇస్తామని చెప్పి కోట్లాది రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారని, నిధులను షెల్ కంపెనీలకు దారి మళ్లించి ఎన్ క్యాష్ చేసుకున్నారని ఆరోపించారు. ఈ కేసులో మొదట సమాచారం ఇచ్చింది కేంద్ర పరిధిలోని జీఎస్టీ శాఖ అని తెలిపింది. ఈ కేసులో తమ వాదనను కూడా మీ ముందు ఉంచడానికి అనుమతివ్వాలని కోరింది.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆధ్వర్యంలో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నారు. అనంతపురం నుంచి మంగళగిరి వరకు చేపట్టిన ఈ సైకిల్ యాత్ర నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చేరుకుంది. సైకిల్ యాత్రకు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ మండల కన్వీనర్ పెలపూడి వెంకటరత్నం తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్ర నిరవధికంగా వాయిదా పడింది. తొలుత శుక్రవారం మొదలు పెట్టాలని నిర్ణయించారు. రాత్రి 8 గంటల 15 నిమిషాలకు ముహుర్తం కూడా నిర్ణయించారు. కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్లు నడవాలని తోలుత తీర్మానించారు. ఆ తర్వాత సమాలోచనల అనంతరం వాయిదా వేస్తున్నట్లు టీడీపీ ప్రకటించింది. అక్టోబర్ 3న సుప్రీంకోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో వాదనలు ఉన్నాయి. ఈ తరుణంలో అప్పటి వరకు పాదయాత్ర ఉండబోదని టీడీపీ అధికారికంగా ప్రకటించింది. పాదయాత్ర మళ్లీ ఎప్పుడు ప్రారంభించాలనేది తర్వాత వెల్లడిస్తామని వివరించింది. తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, తెలుగు తమ్ముళ్లు కూడా వాయిదా వేయాలనే అభిప్రాయపడ్డారు. దీంతో లోకేష్ ఏకీభవించారు. యువగళం పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని నిర్ణయించారు. త్వరలోనే నాయకులతో చర్చించి యువగళం పున:ప్రారంభ తేదీని ప్రకటించనున్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో చక్రం తిప్పిన వ్యక్తి ఇప్పుడు బెయిల్ పైన బయటకు వస్తే సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయాన్ని బతకనిస్తారా? అని తనదైన శైలిలో చురకలు అంటించారు. చంద్రబాబు పదేపదే తాను రాష్ట్రపతి, ప్రధానులను నిర్ణయించానని, ఢిల్లీలో చక్రం తిప్పానని చెబుతుంటారు. ఈ వ్యాఖ్యలతోనే విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
సీఎం కేసీఆర్ ఇవాళ సొంత నియోజకవర్గం గజ్వేల్ కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని స్థానాల్లో గెలవబోతోందో తమ అంచనాలు వెల్లడించారు. త్వరలో జరిగే ఎన్నికల్లో తనకు తెలిసినంతవరకు బీఆర్ఎస్ కు 95 నుంచి 105 స్థానాలు వస్తాయని తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదని, ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని ధీమా వ్యక్తం చేశారు. ఓ కారణంతోనే తాను ఈసారి కామారెడ్డిలో పోటీ చేస్తున్నానని, అయితే గజ్వేల్ ను వదిలిపెట్టి వెళ్లబోనని స్పష్టం చేశారు. రాష్ట్రానికి తలమానికంగా ఉండేలా గజ్వేల్ ను అభివృద్ధి చేసే బాధ్యత నాది అని ఉద్ఘాటించారు. కాగా, గజ్వేల్ లో ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఓ సెంటిమెంటుగా వస్తోందని సీఎం కేసీఆర్ వివరించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచార పర్యటనలు చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ లో జరిగిన సభలో పాల్గొన్నారు. అనంతరం తెలంగాణలో దొరల పాలనకు చరమగీతం పాడి, ప్రజా తెలంగాణకు ప్రతిష్టాపన చేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడి ప్రజలతో తనకున్నది రాజకీయ అనుబంధం కాదని, కుటుంబ అనుబంధం అని రాహుల్ పేర్కొన్నారు. నెహ్రూ, ఇందిరాగాంధీ హయాం నుంచి ఈ అనుబంధం కొనసాగుతోందని తెలిపారు. తనకు సొంత ఇల్లు లేకపోయినా బాధపడనని, కోట్లాది ప్రజల హృదయాల్లో తనకున్న స్థానం చాలని వ్యాఖ్యానించారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం సహకరించుకుంటాయన్నారు. అసోం, రాజస్థాన్, మహారాష్ట్రలో మేం ఎక్కడ బీజేపీతో పోరాటం చేస్తుంటే అక్కడ ఎంఐఎం తన అభ్యర్థులను దింపుతోందని రాహుల్ గాంధీ విమర్శించారు. పార్లమెంటులో బీజేపీ తీసుకువచ్చిన బిల్లులన్నింటికి బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని స్పష్టం చేశారు. ఈసారి తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు జాగ్రత్తగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీజేపీ పనైపోయిందని, బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామంటున్నారని రాహుల్ వివరించారు.
వరుస విజయాల పరంపరలో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇస్రో తొలిసారిగా మానవ సహిత ప్రయోగానికి ఇప్పటికే సిద్ధం అయ్యింది.. రేపు ఉదయం ఏడు గంటలకు ప్రయోగాన్ని నిర్వహించేందుకు ఇస్రో శాస్త్ర వేత్తలు సిద్ధమయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో భవిష్యత్తులో చేపట్టనున్న గగన్ యాన్ ప్రాజెక్టుకి సంబంధించి మానవ సహిత ప్రయోగాలు నిర్వహించేందుకు ఈనెల 21న ఒక ప్రయోగాత్మక ప్రయోగానికి శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా టెక్నికల్ వెహికల్- డెమోన్ స్ట్రేషన్-1 అనే పేరుతో ఈనెల 21న ఉదయం 7 గంటలకు ప్రయోగాత్మక ప్రయోగాన్ని నిర్వహించనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ లోని మొదటి రాకెట్ ప్రయోగ వేదికను సర్వం సిద్ధం చేశారు. కేరళ నుంచి క్రూ మాడ్యూల్ ను ఇప్పటికే శ్రీహరికోటకు తీసుకువచ్చారు.




Total views : 194859