Tuesday, September 15, 2026
News Navigation
Tuesday, September 15, 2026
News Navigation

Breaking

Tuesday, September 15, 2026
Home Andhra PradeshChittoor రాబోయే ఎన్నికల్లో వైసీపీ ని ఇంటికి పంపుదాం..

రాబోయే ఎన్నికల్లో వైసీపీ ని ఇంటికి పంపుదాం..

by Rama
TDP-Janasena

పుంగనూరు నియోజకవర్గంలో జనసేన టీడీపీ సమన్వయ సమావేశం ఈడిగపల్లి లో జరిగింది. పుంగనూరు నియోజకవర్గం జనసేన సామాన్వయకర్త, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి సీరివేలు గంగాధర్ రాయల్ (చిన్నా ) గారు మరియు టీడీపీ ఇంచార్జ్ చల్లా బాబు ల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జనసేన టీడీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధి గా వచ్చిన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షలు పసుపులేటి హరిప్రసాద్ గారు మాట్లాడుతూ ఈ ఆత్మీయ సమావేశం చూసాక ఉమ్మడి పార్టీల గెలుపు మీద నమ్మకం కలిగింది అని అన్నారు. ఇరు పార్టీల నాయకులు చర్చించుకున్న అనంతరం గ్రామ స్థాయి నుండి వార్డు స్థాయి వరకు జనసేన టీడీపీ సమన్వయంతో ముందుకి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇరు పార్టీల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also..

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: