Friday, July 10, 2026
News Navigation
Friday, July 10, 2026
News Navigation

Breaking

Friday, July 10, 2026
Home National కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం..

కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం..

by CVR NEWS
కేరళ సీఎంగా వీడీ సతీషన్ నియామకం

కేరళం సీఎంగా వీడీ సతీషన్ నియామకమయ్యారు. ముఖ్యమంత్రిగా ఆయన పేరును అధిష్ఠానం అధికారికంగా ప్రకటించింది. వీడీ సతీషన్ కేరళ రాజకీయాల్లో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఎర్నాకులం జిల్లా నెట్టూరు స్వస్థలమైన సతీషన్.. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. KSU, NSUI ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. తరువాత రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఎంఏ, ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన సతీషన్.. కేరళ హైకోర్టులో అడ్వకేట్‌గా కూడా పనిచేశారు. 2001 నుంచి పరవూర్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓటమి ఎరగని నేతగా నిలిచారు. 1964 మే 31న జన్మించిన వీడీ సతీషన్.. ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందుతున్నారు.

Advertisements

You may also like

Our Visitor

039484
Total views : 197091

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: