Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home National శత్రు డ్రోన్లను కూల్చేందుకు రూపుదిద్దుకున్న ఇంద్రజాల్‌ రేంజర్‌ ..

శత్రు డ్రోన్లను కూల్చేందుకు రూపుదిద్దుకున్న ఇంద్రజాల్‌ రేంజర్‌ ..

by CVR NEWS
శత్రు డ్రోన్లను కూల్చేందుకు రూపుదిద్దుకున్న ఇంద్రజాల్‌ రేంజర్‌

ఆధునిక యుగంలో యుద్ధ తంత్రాలు మారాయి. గతంలో భారీ ఆయుధాలు, విమానాలతో యుద్ధాలు జరిగితే… ఇప్పుడు చిన్నపాటి డ్రోన్లు వచ్చి పెను విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంలో డ్రోన్ల ప్రభావం ఎంతలా ఉందో ఇప్పటికే మనం చూస్తున్నాం. గత ఏడాది ఆపరేషన్ సింధూర్‌ సమయంలో పాకిస్థాన్ కూడా ఇదే తరహాలో మనపై డ్రోన్ల దాడికి పాల్పడింది. దీన్ని భారత్‌ సమర్థంగానే ఎదుర్కొన్నప్పటికీ.. ఈ రంగంలో మరింత ఆధునాతన వ్యూహాన్ని అవలంభించేందుకు మన దేశం సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఇంద్రజాల్ రేంజర్‌ అనే యాంటీ డ్రోన్‌ వెహికిల్‌ రూపుదిద్దుకుంది. హైదరాబాద్‌కు చెందిన ఇంద్రజాల్ డిఫెన్స్‌ టెక్నాలజీ సంస్థ ఈ వాహనాన్ని రూపొందించింది. ఇది ఒక వాహనానికి అమర్చిన యాంటీ డ్రోన్ సిస్టమ్. ఇంతవరకు ఉన్న రక్షణ వ్యవస్థలు ఒకేచోట స్థిరంగా ఉండేవి. కానీ ఈ వాహనం వల్ల సరిహద్దుల్లో ప్రయాణిస్తూనే కదులుతున్న శత్రు డ్రోన్లను గుర్తించి నిర్వీర్యం చేయడం వీలవుతుంది. ఇందులోని రాడార్లు, డైరెక్షన్‌ ఫైండర్లతో కూడిన త్రీ లేయర్ టెక్నాలజీ ఎలాంటి డ్రోన్లను అయినా సులభంగా పసిగట్టగలుగుతుంది. దేశంలోని మొట్టమొదటి ఏఐ ఆధారిత పూర్తి మొబైల్ యాంటీ డ్రోన్ పెట్రోలింగ్ వాహనం ఇది. ఇంద్రజాల్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే… భారత సరిహద్దు బలగాల పని మరింత సులువు అవుతుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.

Advertisements

You may also like

Leave a Comment

Our Visitor

018677
Total views : 89154

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.