ఇటీవల చైనాలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలు సాధించిన భారతీయ క్రీడాకారులు హస్టరీ క్రియేట్ చేసింది అదే దారిలోనే చైనాలో జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లోనూ ప్లేయర్లు సత్తా చాటారు. ఈ గేమ్స్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే భారత్ అన్ని కలిపి 73కు పైగా పతకాలను సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. కాగా, ఇవాళ పారా ఏషియన్ గేమ్స్‌లో 100 పతకాలు సాధించి చరిత్ర క్రియేట్ చేశారు. 2018 లో జరిగిన టోర్నీలో భారత్ మొత్తం 72 పతకాలను మాత్రమే అత్యధికంగా గెలుచుకొగలిగింది. అయితే ఇవాళ కూడా మరిన్ని పతకాలు వచ్చే అవకాశం ఉంది. కాగా, పారా ఆసియా గేమ్స్‌లో వంద పతకాలు సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. భారత్ పారా ప్లేయర్లకు శుభాకాంక్షలు తెలిపారు.
National
మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు కర్ణాటక మోడల్ కావాలా?, తెలంగాణ మోడల్ కావాలా అని నిర్ణయించుకోవాలని సవాల్ విసిరారు. దీంతో కాంగ్రెస్ నాయకులు వంశీ చంద్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ సవాల్ ను స్వీకరించి, ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్దకు చేరుకున్నారు. ఓయూలో మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ ఓయూ ఆర్ట్స్ కళాశాల అన్నారు. ఈ కళాశాల నుంచి బస్ పెడతామని, అదే బస్ లో కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి కర్ణాటకకి వెళ్దడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. మంత్రి కేటీఆర్ కు ఓయూకి వచ్చి విద్యార్థులను ఎదుర్కొనే దమ్ము ఉందా చాలెంజ్ చేశారు. తెలంగాణ లో యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేటీఆర్ చెపుతున్నారని, అదే నిజమైతే బహిరంగ చర్చకు రావాలన్నారు.
చంద్రయాన్-3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ ద్వారా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో దేశానికి ఎనలేని కీర్తిని సంపాదించి పెట్టింది. ప్రపంచదేశాలు సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. ఈ ప్రయోగానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు అందరూ చాలా ఉత్సుకత ప్రదర్శించారు. ఈ ప్రయోగానికి సంబంధించి తాజాగా మరో ఆసక్తికరమైన విషయం వెల్లడైంది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో అక్కడి ఉపరితలంపై దాదాపు 2.06 టన్నుల దుమ్ము గాల్లోకి లేచింది. మట్టి, రాళ్లు గాలిలోకి లేచి కిందపడ్డాయని హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టులు గుర్తించారు. చంద్రుడి కక్షలోనే తిరుగుతున్న చంద్రయాన్-2 ఆర్బిటర్‌లోని ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా సాయంతో శాస్త్రవేత్తలు ఈ పరిణామాన్ని విశ్లేషించారు. ల్యాండింగ్‌కు కొన్ని గంటల సమయం ముందు, ఆ తర్వాత తీసిన ఫొటోలను విశ్లేషించడం ద్వారా ఈ విషయాన్ని గుర్తించారు. డిసెంట్ స్టేజ్ రాకెట్ల ప్రజ్వలన ప్రక్రియ కారణంగా భారీగా దుమ్ము పైకి లేచినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. కాగా.. దుమ్ము భారీగా ఎగిసిపడిన ప్రభావంతో ఆ ప్రాంతం ప్రకాశవంతంగా మారింది. ఇలా జరగడాన్ని ‘ఎజెక్టా హాలో’ అని అంటారు. దాదాపు 108.4 మీటర్ల విస్తీర్ణంలో ఈ ప్రభావం కనిపించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిణామాల సమయంలో చంద్రుడి దుమ్ము ప్రతిస్పందన తీరును తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ షాంఘైలో గుండెపోటుతో మృతి చెందారు. రాత్రి 12.10 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన గతంలో చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధ్యక్ష పదవి కోసం జీ జిన్‌పింగ్‌తో పోటీ పడ్డారు. చివరికి ఆయన నంబర్-2 స్థానంతో సరిపెట్టుకున్నారు. 2013 నుంచి 2023 వరకు ప్రధానిగా పనిచేశారు. చైనా ఆర్థిక వ్యవస్థను ఆయన సమర్థంగా నిర్వహించారనే పేరుంది.
దసరా శరన్నవరాత్రులు ముగిసిన సందర్భంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఘనంగా దుర్గాపూజ కార్నివాల్ నిర్వహించారు. ఈ కార్నివాల్‌కు బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతాబెనర్జీ హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ దుర్గా పూజ కార్నివాల్‌ను వేల మంది ప్రత్యక్షంగా వీక్షించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు ప్రదర్శించిన నృత్య కళలు చూపరులను అలరించాయి. దుర్గాదేవికి సంబంధించిన ఓ భక్తి పాటకు పురుష, మహిళా కళాకారులు కర్రలపై నిలబడి చేసిన నృత్యం కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్నివాల్లో ప్రదర్శించిన వివిధ కళలను మమతాబెనర్జీ ఆసక్తిగా తిలకించారు. పాటకు అనుగుణంగా తన ముందున్న టేబుల్‌పై రెండు చేతులతో లయబద్ధంగా కొడుతూ ఆమె ఎంజాయ్ చేశారు.
త్రిపుర గవర్నర్ గా నల్లు ఇంద్రసేనా రెడ్డి ఈ ఉదయం బాధ్యతలు స్వీకరించారు. అగర్తలాలో త్రిపుర హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేశ్ కుమార్ సింగ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య మంత్రి డాక్టర్ మాణిక్ సాహా, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం నూతన గవర్నర్ కు సాయుధ దళాలు గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించాయి. అనంతరం ప్రముఖులను ముఖ్యమంత్రి కొత్త గవర్నర్ కు పరిచయం చేశారు. ఈ కార్యక్రమం లో ప్రధాని కార్యాలయ అధికారులు, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ దంపతులు బుధవారం నాడు అగర్తలా చేరుకున్నారు . ఆ సమయం లో గవర్నర్ దంపతులను ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహ , అతని మంత్రివర్గ సహచరులు , ఎమ్మెల్యేలు , ఎంపీ లు, సీనియర్ ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు అగర్తలా విమానాశ్రమయం లో ఘన స్వాగతం పలికారు. అక్కడ కొత్త గవర్నర్ కు “గార్డు -ఆఫ్ -హానర్” నిర్వహించారు. ఈ సందర్భం గా తన నియామకం పై రాష్ట్రపతికి , ప్రధాని కి, కేంద్ర హోమ్ మంత్రి కి నల్లు ఇంద్రసేనా రెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు. అధికారులు పారదర్శకత , జవాబుదారీతనం పాటించాలని , సాధారణ పౌరులు సైతం సాధికారత సాధించేలా అంతా కృషి చేయాలని పలుపునిచ్చారు. ఈ సందర్భం గా అనేకమంది ప్రజా ప్రతినిధులు, నాయకులు గవర్నర్ కు అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన అభిమానులు పూల దండలతో నల్లు ఇంద్రసేనా రెడ్డి గారిని సత్కరించారు .
మరో నెల రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్ లో ఈడీ సోదాలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటాస్రా, మహువా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫెమా నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించిన కేసులో వైభవ్‌కు ఈ సమన్లు అందినట్లు తెలిసింది. ఈ కేసులో వైభవ్‌ను ప్రశ్నించేందుకు అక్టోబరు 27న దర్యాప్తు సంస్థ ఎదుట హాజరుకావాలని ఈడీ పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు.దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ కేంద్రంపై ధ్వజమెత్తారు. అక్టోబరు 25న, రాజస్థాన్ మహిళల కోసం కాంగ్రెస్ హామీలు ప్రకటించింది. ఆ మరుసటి రోజు అక్టోబరు 26న రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్‌పై ఈడీ దాడులకు దిగింది. నా కుమారుడు వైభవ్‌కు సమన్లు జారీ చేసిందని గహ్లోత్ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
డీకే అరుణ బీజేపీకి గుడ్ బై చెపుతున్నారంటూ వస్తున్న వార్తలపై డీకే అరుణ స్పందించారు. తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ లో చేరే అవకాశమే లేదని చెప్పారు. తనపై కొందరు పనికట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ అధినాయకత్వం తనను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవిని ఇచ్చిందని అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేయాలంటే అదృష్టం ఉండాలని చెప్పారు. మరోవైపు, బీజేపీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు ఆయన స్పష్టం చేశారు. నియంత కేసీఆర్ పాలనను అంతమొందించేందుకే తాను కాంగ్రెస్ లో చేరుతున్నానని ఆయన తెలిపారు.
కర్ణాటక చిక్కబళ్లాపుర్లో ఆగి ఉన్న ట్యాంకర్‌ను టాటా సుమో వాహనం ఢీకొట్టగా.. 8 మంది మరణించారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. టాటా సుమోలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. పొగ మంచు వల్లే ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. మృతులంతా సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కూలీ పనుల కోసం బెంగళూరు వెళ్తుండగా ఘటన జరిగింది.
అవసరమైన సమయంలో విద్యుత్ సరాఫరా చేయడం లేదని, కరెంటు కోతలు ఎక్కువగా ఉన్నాయంటూ కర్ణాటకలోని కొల్హార తాలూకా రోణిహాల్ గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. స్థానికంగా ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్‌కు ట్రాక్టర్లో ఓ మొసలిని తీసుకొచ్చారు. కరెంట్ ఇస్తారా?.. సబ్ స్టేషన్లో మొసలిని వదలాలా? అంటూ సిబ్బందిని రైతులు ప్రశ్నించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా, ఈ వీడియోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు. ‘ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో’ అంటూ కాంగ్రెస్ సర్కారుపై సెటైర్లు సంధించారు.



Total views : 194080