పేద ప్రజలు బ్రతకాలి అంటే తెలుగు దేశం పార్టీ రావాలని మాజి మంత్రి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని 30వ వార్డు సిద్దేశ్వర కాలనీ లో బాబు ష్యూరిటి – భవిష్యత్తుకు గ్యారెంటీ అను కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులకు భారీ మద్దతుతో కాలనీ వాసుల నీరాజనాలు పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆశీర్వాదం, సహకారం, అవసరమని మళ్లీ తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలను పరిష్కారిస్తూ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటిలోనూ చదువుతున్న విద్యార్థుల కు 15000 రూపాయలు ఇలా ప్రజల కోసం ఎన్ని మంచి పథకాలు ఇవ్వడం జరుగుతున్నదని తెదేపా మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు వివరించారు. సంవత్సరానికి మూడు ఉచిత సిలిండర్ ను అందిస్తామని ఓట్లకు హామీ ఇచ్చారు.
Political
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా. ఈ కార్యక్రమంలో తనకు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, రాష్ట్రస్థాయిలోని పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారంటున్నారు నూరి ఫాతిమా. వచ్చే ఎన్నికలలో తూర్పు నియోజకవర్గ సీటు తనదే అంటున్న తూర్పు ఎమ్మెల్యే తనయురాలు గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమాతో మా సివిఆర్ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు పేస్.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎలాగైనా అధికారం చెపట్టాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకోని పాతవారిని కొత్తవారిని కలుపుకోని ముందుకెళ్తుంది. అయితే చెన్నూరు అసెంబ్లీ టికెట్ విషయంలో సంధిగ్దత నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ నేత నల్లెల ఓదెలు, ఇటివలే కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ వివేక్ వెంకట్ స్వామి తో కలసి సీనియర్ నేత జానరెడ్డితో సమావేశం అయ్యారు. ఈ నేపధ్యంలో చెన్నూరు టికెట్వి వేక్ వెంకట్ స్వామికి ఇవ్వాలనీ నల్లెల ఓదెలు కోరారు. వివేక్ కి టికెట్ ఇస్తే ఎలాంటి విబేదాలు లేకుండా పనిచేస్తామన్నారు. తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ అని అన్నారు. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధీకారంలోకి వస్తుందని థీమా వ్యక్తం చేశారు.
తిరుమల శ్రీవారిని మంత్రి అమర్నాథ్ దర్శించుకున్నారు. జగనన్న ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందిందని క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఏర్పాటు అవుతున్న పరిశ్రమలకు వస్తున్న పెట్టుబడులకు సంబంధించి వారు ముందుకు రావాలని శ్రీవారి ఆశీస్సులు తీసుకోవాలని రావడం జరిగింది. నిన్న జరిగిన కేబినెట్ సమావేశం లో 19 వేల కోట్ల రూపాయలతో పెట్టుబడులకు సంబంధించి ఆమోదం తెలపడం జరిగిందని, అత్యంత వెనుకబడిన ప్రాంతమైన పుంగనూరులో ఎనిమిది వేల కోట్లతో ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడం కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాబోవు రెండు మూడు నెలలలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం కూడా జరుగుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదట విశాఖపట్నంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి మాడ్యూల్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కూడా అందుబాటులోకి రానుంది. తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ నాయకులు మాటలు వీలును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు లాంటి దొంగల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు రాజకీయాలు మాట్లాడటానికి తిరుమల వేదిక కాదు అన్నారు మంత్రి అమర్నాథ్..
తేనెటీగల దాడిలో పరుగులు తీసిన ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత, కార్యకర్తలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మొదటి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బాణసంచా కాల్చడం తో అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే ప్రచార రథం దిగి పరుగులు తీసిన ఆలేరు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత అనంతరం కాన్వాయ్ లోకి వెళ్లి కూర్చున్నారు.
జడ్జిలను తిట్టారన్న ఆరోపణలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బుద్దా వెంకన్నకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులను దూషించినట్టు బుద్దా వెంకన్నపై అభియోగాలు ఉన్నాయని, ఏపీ హైకోర్టు ఆదేశాలతోనే నోటీసులు ఇచ్చినట్టు సీఐడీ అధికారులు వెల్లడించారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు. కాగా, బుద్దా వెంకన్న వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం హైదరాబాదులో ఉండగా, సీఐడీ అధికారులు హైదరాబాదుకు వెళ్లి మరీ నేరుగా బుద్దాకు నోటీసులు అందించారు.
అభివృద్ధి చేస్తుంటే బుర్ర లేని యరపతినేని శ్రీనివాసరావు ఆరోపణలు చేస్తున్నాడు.. వాళ్ళకి చేయడం చేతకాదు మేము చేస్తే ఏడుస్తున్నారు.. మున్సిపాలిటీ భవన నిర్మాణం, పిడుగురాళ్ళ మెయిన్ రోడ్డు అభివృద్ధి కోసం ఆరు కోట్లు లోన్ తీసుకుంటే తప్పేముంది.. యరపతినేని హయాంలో పిడుగురాళ్లలో ఒక్క ఇంటికి కూడా మంచినీటిని అందించలేకపోయారు.. వైసీపీ హయాంలో 900 కోట్లతో పిడుగురాళ్లని అభివృద్ధి చేస్తున్నాము.. పద్దెనిమిది ఏళ్ళ క్రితమే మున్సిపాలిటీ అయినా ఇప్పటికీ మున్సిపాలిటీకి ఒక భవనం లేదు.. ఇంటింటికి త్రాగు నీటి కనెక్షన్ లు ఇవ్వడం ద్వారా మున్సిపాలిటీ ఆదాయం పెరుగుతుంది.. ఈ నేపధ్యంలోనే లోన్ తీసుకొని భవనం నిర్మాణం చేయాలని నిర్ణయించాం..
Read Also..
హైకోర్టు ఆదేశాల మేరకు తనకు తక్షణమే 6 ప్లస్ 6 భద్రతను కల్పించాలని లేదంటే కంటెంట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తానని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డీజీపీకి లేఖ రాశారు. తన భద్రతకు సంబంధించి శుక్రవారం డీజీపీ అంజనీ కుమార్కు లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పి కూడా ఆ మేరకు భద్రత ఇవ్వడం లేదని ఆ లేఖలో పేర్కొన్నారు. హైకోర్టులో అదనపు సెక్యూరిటీతో భద్రత కల్పిస్తున్నట్లు పోలీసులు తప్పుడు వాదనలు చేశారన్నారు. పైగా గత జూలైలో తనకు ఉన్న 2 ప్లస్ 2 భద్రతను కూడా వెనక్కి తీసుకున్నారన్నారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6 ప్లస్ 6 భద్రత కల్పించాలని, లేదంటే కోర్టుకు వెళ్తానని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు.
జనగామ నియోజకవర్గ బిజెపి పార్టీ అభ్యర్థి ఆరుట్ల దేశమంతా రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు వారు ఏ గ్రామానికి వెళ్లిన మహిళలు మంగళ హారతుల తోటి స్వాగతం పలుకుతున్నారని చెప్పారు. డబ్బులు ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఇక్కడి ప్రజలు స్థానికేతుడు వద్దు స్థానికుడే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్థానికుడు కాకపోవడం వలన జనగామ అభివృద్ధి చెందలేదని జనగామ అభివృద్ధి చెందాలి అంటే బిజెపి పార్టీ అభ్యర్థి అయిన తనకు ఓటు వేయాలని కోరారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో 12 నియోజవర్గల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్ పశ్చిమ రెండు సెట్ల నామినేషన్ పత్రాలను కాంగ్రెస్ అభ్యర్ధి నాయిని రాజేందర్ రెడ్డి దాఖలు చేశారు. దీంతో స్వీకరణ కార్యాలయాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భూపాలపల్లిలో కీర్తిరెడ్డి, గండ్ర సత్యనారాయణరావు నామినేషన్లు వేయనున్నారు. పరకాలలో నామినేషన్లు వేసేందుకు 100 గ్రీన్ఫీల్డ్ బాధిత రైతులు సన్నద్ధం అవుతున్నారు. 12 నియోజకవర్గ కేంద్రంలో ఇండిపెండెంట్ అభ్యర్థుల ఆసక్తి చూపుతున్నారు.




Total views : 92769