బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ శనివారం కోనాయిపల్లి రానున్నారు. తాను సెంటిమెంట్‌గా భావించే వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేయనున్నారు. 1983లో టీడీపీ తరఫున తొలిసారి సిద్దిపేట ఎమ్మెల్యేగా బరిలోకి దిగిన కేసీఆర్.. ఓటమి పాలయ్యారు. 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల సందర్భంగా సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి.. నామినేషన్ దాఖలు చేశారు. ఆ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించడంతో కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసి, నామినేషన్లు దాఖలు చేయడం కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా మారింది. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల సమయంలోనూ కేసీఆర్ ఇదే ఆలయానికి వచ్చి పూజలు చేసిన అనంతరం నామినేషన్ వేస్తున్నారు.ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతున్న కేసీఆర్ ఈసారి కూడా వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత రెండు వేర్వేరు నామినేషన్ సెట్లపై సంతకాలు చేయనున్నారు. ఈనెల 9న ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాగా, మంత్రి హరీశ్‌రావు సైతం కేసీఆర్‌తోపాటు ఇదే ఆలయంలో నామినేషన్ పత్రాలపై సంతకాలు చేసే ఆనవాయితీని 2004 నుంచి కొనసాగిస్తున్నారు.
Political
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపు నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్న తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా.. తను ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సు యాత్ర కార్యక్రమంలో తనకు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, రాష్ట్రస్థాయిలోని పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ, వచ్చే ఎన్నికలలో తూర్పు నియోజకవర్గ సీటు తనదే అంటున్న తూర్పు ఎమ్మెల్యే తనయురాలు గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమా.
Read Also..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను 9 చోట్ల ఎంఐఎం పోటీ చేయబోతోంది. తమ అభ్యర్థుల తొలి జాబితాను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ విడుదల చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అహ్మద్ పాషా ఖాద్రీ, ముంతాజ్ అహ్మద్ ఖాన్ లను ఈసారి ఒవైసీ పక్కన పెట్టారు. చంద్రాయణగుట్ట నియోజకవర్గానికి అక్బరుద్దీన్ ఒవైసీ, నాంపల్లికి మజీద్ హుస్సేన్, మలక్ పేట్ కు అహ్మద్ బలాలా, యాకుత్ పురాకు జాఫర్ హుస్సేన్, చార్మినార్ కు జుల్పికర్, కార్వాన్ కు కౌసర్ మొహియుద్దీన్ ను ప్రకటించారు. బహదూర్ పురా, జూబ్లీ హిల్స్, రాజేంద్రనగర్ స్థానాల అభ్యర్థులను ఇంకా ప్రకటించాల్సి ఉంది.
రాజేంద్రనగర్ నుంచి బిజెపి అభ్యర్థిగా తోకల శ్రీనివాస్ రెడ్డి ఎన్నికైనందుకు రాజేంద్రనగర్ నియోజకవర్గం ప్రజలు ఎంతగానో ఆసక్తిగా వస్తున్నారని ఆయన అన్నారు. రాజేంద్రనగర్ ప్రజలకు ఎంతగానో రుణపడి ఉంటానని రానున్న కాలంలో బిఆర్ఎస్ పూర్తిస్థాయిలో కనుమరుగు చేయడంలో తనదైన శైలిని ప్రదర్శిస్తానని రాజేంద్రనగర్ అభివృద్ధికి కీలక పాత్ర పోషించడమే కాకుండా గతంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికి తీసి పేద ప్రజలకు మెరుగైన వనరులతో పాటు విద్యావంతులని ప్రోత్సహించడంలో ఎంతగానో పాటు పడతానని అలాగే ఆయనకు బిజెపి అధిష్టానం నమ్మి ఎంతో ప్రతిష్టాత్మకమైన రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించినందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అల్లూరి జిల్లా చింతపల్లి లో సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర లో భాగంగా చింతపల్లి కి నాలుగవ రోజు చేరుకున్న రాష్ట్ర సిపిఎం కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు ఈ సందర్భంగా చింతపల్లి పాత బస్టాండ్ వద్ద సిపిఎం జిల్లా కార్యదర్శి బోనంగి చిన్నప్పడాల్ ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావుకు హారతి ఇచ్చే ఆహ్వానించారు ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ వెనుకబడి ఉన్న అల్లూరి సీతారామ జిల్లా మోడీ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థ ఆదానికి భూములు ముట్ట చెప్పడానికి చూస్తుందని అల్లూరి సీతారామ జిల్లాలో ప్రతి మారుమూల గ్రామం కూడా అభివృద్ధి చేయవలసింది పోయి వెనకబడిన ప్రాంతముగా చేయబోతున్నారని అలా జరిగితే మన్య ప్రజలందరూ ఒకటిగా కూడి అడ్డుకుంటామని ఆయన అన్నారు.
Read Also..
భైంసాలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ఆగమాగం చేయాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని, కానీ ఆలోచించి ఓటేయాలన్నారు. ప్రతిపక్షాలు అబద్దాలు, గాలిమాటలు చెబుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల వద్ద ఉన్న ఒకే ఒక వజ్రాయుధం ఓటు అన్నారు. ఈ ఓటును మంచిగా వినియోగించుకోవాలన్నారు. ప్రతిపక్షాల మాయలో ఎవరూ పడవద్దన్నారు. ఏ పార్టీ వైఖరి ఎలా ఉందో ప్రజలంతా పరిగణలోకి తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పాలనలో భైంసాలో రోడ్లు ఎలా వెడల్పు అయ్యారో అందరూ చూస్తున్నారన్నారు. కులం, మతం లేకుండా మనం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. కాంగ్రెస్ నేతలు ఇన్నాళ్లు దళితులను ఓటుబ్యాంకుగా మార్చుకున్నారు తప్ప వారికి చేసిందేమీ లేదన్నారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధును తీసుకువచ్చింది అని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ వచ్చాక ఎరువుల కొరత లేదన్నారు. భైంసాలో, ముధోల్‌లో ఇలా అన్నిచోట్ల హిందువులు, ముస్లింలు ఉన్నారని, కానీ భైంసాలో చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో కర్ఫ్యూలు, ధర్నాలు లేవన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టే వారిని దూరం పెట్టాలన్నారు. అన్ని మతాలు, కులాల వాళ్లం కలిసి ముందుకు సాగుదామన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలిస్తేనే తెలంగాణ మరింత ముందుకు సాగుతుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం.. APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు. రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు తప్పు. APలో పండుతున్న సన్నబియ్యాన్నే ఎక్కువ ధరకు కొని TS వాళ్లు తింటున్నారు. 3 రాజధానుల విజన్‌లో APని అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు.
బహుజన్ సమాజ్ పార్టీ సుల్తానాబాద్ మండలo గర్రేపల్లి గ్రామం నుండి అంతడుపుల రాజేశ్వరి, దుబ్బాసి లక్ష్మి, జెట్టీ ప్రేమలత,అంతడుపుల శారద, 200 మందికి పైగా పార్టీలో చేరగా వారికి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి ఉష కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం దాసరి ఉష మాట్లాడుతూ…. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మహిళలను ఓటర్ల గానే చూశారే తప్ప స్వయంఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బీఎస్పీ అధికారంలోకి వస్తే మహిళలకు 5 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.విధంగా మహిళలకు కుటీర పరిశ్రమలు ఏర్పాటుచేసి మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఎన్నికలవేళ టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మాయమాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు.
Read Also..
ఎన్నికలు ఉన్నా లేకపోయినా ప్రజాసేవే లక్ష్యంగా పని చేశానని, ప్రజల కోసం పని చేసే వ్యక్తికి ఓటు వేయాలని బిఅర్ఎస్ పార్టీ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కోరుకున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రామానగరం గ్రామంలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారాన్ని సండ్ర వెంకట వీరయ్య ప్రారంభించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల కోసం చాలామంది నాయకులు వస్తూపోతూ ఉంటారని అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. రాజకీయ అవసరం కోసం కాకుండా మానవతా దృక్పథంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకువచ్చారని దళితులను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి దళిత బంధు పదాన్ని ఉచ్చరించే అర్హత లేదన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని, దళితులను ఏమాత్రం పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విస్మరించాలని పిలుపునిచ్చారు..




Total views : 92713