రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో BJPకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ టికెట్ ఆశించారు,BJP పార్టీ విడుదల చేసిన మూడవ జాబితాలో తన పేరు లేకపోవడం తో మనస్తాపం చెంది నేడు ఒక ఫంక్షన్ హల్ లో అభిమానులు,ఆత్మీయులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకి భారీ ఎత్తున అభిమానులు హాజరయ్యారు. విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. పార్టీని నమ్ముకొని నమ్ముకొని కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి తన ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించానని, కానీ రాష్ట్ర పార్టీలోని పెద్దలు తనకు టికెట్ రాకుండా అడ్డుకొని తన సామాజికవర్గంకి చెందిన వ్యక్తికి టికెట్ ఇప్పించుకున్నారని పరోక్షంగా ఈటెల రాజేందర్ ని ఉద్దేశించి అన్నారు. అభిమానుల కోరిక మేరకు రెబెల్ అభ్యర్థిగా బరి ఉంటానని, సేవ కార్యక్రమాలు చెయ్యడం వల్ల నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారని వాళ్ళ ఆశీస్సులు తనమీద ఉంటాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు .
Political
ఏలూరు జిల్లా పోలవరంలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రి దేవినేని ఉమ పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ పాయింట్ ను సందర్శించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ ఎత్తిపోతల పథకం అనవసరమని ఎగతాళి చేసి మేము అధికారంలోకి వస్తే మోటర్లు పీకేస్తామని ప్రహబ్బాలు పలికిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కృష్ణ డెల్టాకు సాగునీరు అందుతుందంటే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేనిని ప్రజలకు ఉపయోగపడే ఇటువంటి ప్రాజెక్టులను ఎగతాళి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి ముక్కు నేలకు రాయాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
ప్రొద్దుటూరు టీడీపి నేత నందం సుబ్బయ్య భార్య అపరాజిత మీడియా సమావేశం. ప్రొద్దుటూరు వైసిపి నాయకులు తనను అసభ్యంగా మాట్లాడుతున్నారు. మూడేళ్ల క్రితం నా భర్త నందం సుబ్బయ్యను వైసిపి ఎమ్మెల్యే బావమరిది బంగారు రెడ్డి హత్య చేశారు. ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ప్రోత్సాహించడంతోనే బంగారు రెడ్డి తన భర్తను చంపారు. బంగారు రెడ్డి చేసే దందాలు, భూ కబ్జాలు బయట పెడతారనే నందం సుబ్బయ్యను చంపారు. నందం సుబ్బయ్యను చంపినట్టే చంపుతామని వైకాపా నాయకులు అందరినీ బెదిరిస్తున్నారు. నా భర్తను చంపిన వాళ్ళు జైల్లో ఉండాలని ప్రతిరోజూ ప్రార్థిస్తున్నా. నందం సుబ్బయ్య హత్య కేసులో ఉన్న బెనర్జీ వైసీపీ నేతలతో ఎందుకు తిరుగుతున్నాడు. నందం సబ్బయ్యను చంపినట్టు చంపుతామని బెనర్జీ అందరినీ బెదిరిస్తున్నారు. ఇటీవల వైసిపి కార్యకర్త బెనర్జీ పై దాడి జరిగితే ఎలాంటి సంబంధం లేని ప్రొద్దుటూరు టిడిపి ఇంచార్జ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి పై కేసు నమోదు చేయడం దారుణం. వచ్చే ఎన్నికల్లో టీడీపి గెలుస్తుంది…నా భర్తను చంపిన వాళ్ళు జైలుకెళ్ళడం ఖాయం…
వికారాబాద్ జిల్లాలోని నాల్గు నియోజకవర్గాలు వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ లలో ఫాం వన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, ఎస్పీ కోటి రెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యిందని, నేటి నుంచి ఈ నెల 13వ తేదీ వరకు నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరిస్తారని, ఉదయం 11గంటల నుంచి 3గంటల వరకు నామినేషన్లను దాఖలు చేసుకోవచ్చన్నారు. నామినేషన్ తో పాటు ఫాం 26 అఫిడవిట్ ను కూడా RO దగ్గర పొందవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా 1133 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని ,ఇప్పటివరకు కోటి 91లక్షల నగదు ..2300 లీటర్ల లిక్కర్ స్వాధీనం చేసుకొని ఒక గాంజా కేసు నమోదు చేశామన్నారు. 293మంది రౌడీ షూటర్ లను బైండోవర్ చేసి ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించామని, జిల్లా వ్యాప్తంగా 218మంది లైసెన్స్ గన్ లను స్వాధీనం చేసుకున్నామని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు.
అలిపిరి పాదాల మండపం, పార్వేట మండపం పై బిజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యాఖ్యలను ఖండించారు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి. తిరుమలలో వైల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..పార్వేట మండపాన్ని మరమ్మత్తు చేసే అవకాశం లేనందునే జీర్ణోధరణ చేసామని, అలిపిరి పాదాల మండపం పునరుద్ధరణను బిజేపీ వ్యతిరేకించడం సమంజసం కాదు అన్నారు. పాదాల మండపం పురావస్తు శాఖ పరిధిలో లేదని గుర్తు చేసారు. ఇంజనీర్ విభాగం క్షుణ్ణంగా పరిశీలించి…మరమ్మత్తులు అవకాశం లేదని తేల్చి చెప్పారు. 90శాతం స్తంభాలను వినియోగించే పాదాల మండలం పునరుద్ధరణ చేస్తాం అన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా, సునితమైన ఆంశాలపై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు అన్నారు. భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న చర్యలను అడ్డుకోవడం మంచి చర్య కాదు అని,మాజీ బోర్డు సభ్యుడిగా ఉండి భానుప్రకాష్ రెడ్డి కూడా టీటీడీపై ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. పార్వేట మండపం పరిశీలనకు బిజేపీ భానుప్రకాష్ ని నేను స్వాగతిస్తున్నా, మీడియా సమక్షంలో మండపం జీర్ణోధరణ పనులు పరిశీలించి నిజాలు భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు ఈఓ ధర్మరెడ్డి.
రాజకీయ నాయకులు ప్రజలకు చేసేది చెప్పాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయొద్దని , రాజకీయాలు నూతన తరానికి ఆదర్శంగా ఉండాలని
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక విజన్ ఉన్న నాయకుడని , తెలంగాణను కేసీఆర్ తప్ప ఎవరికి పాలించే అర్హత లేదన్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 కి 12 మంది BRS ఎమ్మెల్యే లు గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అభ్యర్థులు 12 మంది ఉన్నారని మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయంమని ,ప్రజలు దీవించడానికి సిద్ధంగా వున్నారన్నారు.
టిడిపి, బిజెపి, జనసేన పొత్తుల విషయం అధినాయకత్వం చూసుకుంటుందని, ఎన్నికల రెండు నెలల ముందు పొత్తులపై నిర్ణయం కేంద్రంలోని పెద్దలు తీసుకుంటుంటారని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. శుక్రవారం స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ని ఆమే దర్శించుకున్నారు. ఆలయ మర్యాదులతో స్వాగతం పలికి స్వామి వారి దర్శిన బాగ్యం కల్పించి, స్వామి వారి తీర్థ ప్రసాదాలు, చిత్రపట్టాన్ని అందజేసిన ఆలయ ఈవో వెంకటేశు. తరువాత అగరంపల్లిలో బిజెపి కార్యాలయం ను ప్రారంభించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశ పాలను కొనసాగుతుందని ఎదిరించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని రాష్ట్రవ్యాప్తంగా…లిక్కర్, ఇసుక, మైనింగ్ లతో అడ్డంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ఇబ్బంది పెడుతున్నారని అన్నారు.
తెలంగాణలో ఎన్నికల బరిలో దిగుతున్నామని భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షులు బొడే రామచంద్ర యాదవ్ ప్రకటించారు. తమ పార్టీ రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని చెప్పారు. అన్నివర్గాల అభివృద్ధికి మేనిఫెస్టోను ప్రకటించామన్నారు. దేశ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు రామచంద్ర యాదవ్. బీసీవై పార్టీ మొదటి జాబితాను విడుదల చేశారు. మొత్తం 20 మంది అభ్యర్థుల పేర్లను ఫస్ట్ లిస్ట్ లో ప్రకటించారు రామచంద్రయాదవ్.
ఇదివరకే పలు వివాదల్లో చిక్కుకున్న జీవితా రాజశేఖర్.. ఇప్పుడు పలు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అయితే అందుకు బదులుగా సమాధానమిస్తూ.. తనకు వైసీపీతో ఎలాంటి సంబంధం లేదని నటి జీవితా రాజశేఖర్ అన్నారు. ప్రస్తుతం పలు మీడియాల్లో సర్క్యులేట్ అవుతోన్న తన ఫోటోలు పాతవేనని స్పష్టం చేశారు. తాను ఇప్పుడు బీజేపీతోనే ఉన్నట్లు తెలిపారు. వ్యూహం అనే సినిమా రివ్యూ కమిటీకి వచ్చినప్పుడు అన్ని సినిమాల్లాగే దాన్నీ చూస్తానన్నారు. అయితే తనకు ఆఫీస్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదని పేర్కొన్నారు.
నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్న నేను ఇసుక ర్యాంపుల్లో ఎక్కడ అక్రమాలు చేయలేదని దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు… ఏలూరు రూరల్ మండలం పాలగుడంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్… పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇసుకలో పదివేల కోట్లు అక్రమాలు జరిగాయని నాపై కేసు నమోదు చేసి ఏ 3 గా చేర్చారని అన్నారు.. టిడిపి ప్రభుత్వ హాయంలో డ్వాక్రా మహిళల నిర్వహిస్తున్న ఇసుక ర్యాంపుల్లో ఒక్క రూపాయి తీసుకున్న నా పిల్లలు నాకు కాకుండా పోతారని అన్నారు… పరిదిధాటి వేరే ఎమ్మార్వో మా నియోజకవర్గంలోని ఇసుక ర్యాంపుల్లోకి వచ్చిందని డ్వాక్రా మహిళలు పిలిస్తే వెళ్ళానని, నా నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి చెందిన ఎమ్మార్వో దౌర్జన్యం ఏంటని వెళ్తే నాపై లేనిపోని ఆరోపణలు చేసి గ్లోబల్ ప్రచారం చేశారని ఆరోపించారు.. ఏపీలో లిక్కర్ స్కాం గురించి మాట్లాడితే చంద్రబాబు జైల్లో ఉన్నా లిక్కర్ కేసులో ఆయన ముద్దాయిగా చేర్చారని ఇప్పుడు ఇసుక దోపిడీ గురించి మాట్లాడితే మాపై కేసులు పెట్టారుని మండిపడ్డారు.




Total views : 92597