Sunday, September 13, 2026
News Navigation
Sunday, September 13, 2026
News Navigation

Breaking

Sunday, September 13, 2026
Home Film మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మరో కొత్త సినిమా..

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో మరో కొత్త సినిమా..

by Rama
Priyadarsi

2016లో నానితో ‘జెంటిల్ మన్’ – 2018లో సుధీర్ బాబుతో ‘సమ్మోహనం’- ఇప్పుడు ముచ్చటగా మూడోసారి మోహనకృష్ణ ఇంద్రగంటి (Indraganti Mohana krishna) – శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో ఓ చిత్రం ప్రారంభమైంది. ప్రియదర్శి, రూప కొడువాయూర్ ఇందులో హీరో హీరోయిన్లు. శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్. 15 గా రూపొందుతోన్న ఈ చిత్రం సోమవారం (మర్చి 25) ఉదయం సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది . దేవుని పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ సతీమణి అనిత క్లాప్ ఇవ్వగా, దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ సతీమణి ఉమా మహేశ్వరి కెమెరా స్విచ్ ఆన్ చేసారు.

Follow us on : FacebookInstagram, YouTube & Google News

ఈ సందర్బంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ -“మా శ్రీదేవి మూవీస్ సంస్థకి ఆత్మీయుడు, నాకు అత్యంత సన్నిహితుడైన ప్రతిభా శాలి మోహనకృష్ణ ఇంద్రగంటి తో జెంటిల్ మన్, సమ్మోహనం చిత్రాల తర్వాత మళ్ళీ సినిమా చేస్తున్నందుకు చాల సంతోషంగా ఉంది. ‘బలగం’ తో హీరోగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రియదర్శికి హీరోగా యాప్ట్ సబ్జెక్ ఇది. తెలుగమ్మాయి రూప కొడువాయూర్ ఇందులో కథానాయికగా నటిస్తున్నారు. ఇదో క్యూట్ ఫిలిం. స్వీట్ ఎంటర్టైనర్. చక్కటి వినోదంతో పాటు మంచి భావోద్వేగాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటి ట్రెండ్ లో జంధ్యాలగారు సినిమా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా . ఈ రోజు నుంచి హైదరాబాద్ లో చిత్రీకరణ మొదలయింది” అని తెలిపారు.

ప్రియదర్శి, రూప కొడవాయూర్, వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవ’ హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె. మణి, ఇందులో ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి సాంకేతిక నిపుణులు కాస్ట్యూమ్స్-మనోజ్; కాస్ట్యూమ్ డిజైనర్-రాజేష్-శ్రీదేవి; ప్రొడక్షన్ కంట్రోలర్స్- పి. రషీద్ అహ్మద్ ఖాన్, కె. రామాంజనేయులు; పి.ఆర్.ఓ- పులగం చిన్నారాయణ; కో-డైరెక్టర్- కోట సురేష్ కుమార్; పాటలు- రామజోగయ్య శాస్త్రి; ఫైట్స్- వెంకట్; ప్రొడక్షన్ డిజైనర్- రవీందర్; ఎడిటర్- మార్తాండ్ కె. వెంకటేష్; డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ- పి .జి. విందా; సంగీతం- వివేక్ సాగర్; లైన్ ప్రొడ్యూసర్స్ -విద్య శివలెంక, లిపిక ఆళ్ల , నిర్మాత-శివలెంక కృష్ణప్రసాద్; రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

ఇది చదవండి: ‘కలియుగ పట్టణంలో’ సస్పెన్స్ థ్రిల్లర్ తో పాటు మదర్ సెంటిమెంట్…


‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..
‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్.. యునానిమస్ బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్‌‌లో …
ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా.
ప్యారడైజ్ నా కెరీర్‌లోనే ఎక్కువ కష్టపడి చేసిన సినిమా. సెప్టెంబర్ 24న వస్తున్నాం. ఫస్ట్ నుంచి …
ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్..
ఘనంగా ఇరుముడి బ్లాక్ బస్టర్ సెలెబ్రేషన్స్.. నాకు రెస్పెక్ట్ తెచ్చిపెట్టిన సినిమా అంటూ రవితేజ ఎమోషనల్ …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి


Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: