Saturday, September 12, 2026
News Navigation
Saturday, September 12, 2026
News Navigation

Breaking

Saturday, September 12, 2026
Home Andhra Pradesh పిఠాపురం ప్రొటోకాల్ వివాదంపై సీఎం అసహనం..

పిఠాపురం ప్రొటోకాల్ వివాదంపై సీఎం అసహనం..

by CVR NEWS

పిఠాపురం కేంద్రంగా రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వర్మ తో జనసన నేతల తీరు పైన వివాదం కొనసాగుతోంది. వర్మ వర్సస్ జనసేన అన్నట్లుగా నియోజక వర్గంలో పరిస్థితి మారుతోంది. తాజాగా ఫ్లెక్సీ విషయంలో మొదలైన వివాదం.. ఘర్షణ వరకు దారి తీసింది. ఈ వ్యవహారం పైన సీఎం చంద్రబాబు ఆరా తీసారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో మాట్లాడిన సీఎం చంద్రబాబు అక్కడి పరిస్థితు పైన పూర్తి సమాచారం సేకరించారు. పిఠాపురం ప్రొటోకాల్ వివాదం పై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసారు. మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యవహార శైలిని సీఎం తప్పు బట్టారు. ఈ ఘటన పైన పల్లా శ్రీనివాస్ లో మాట్లాడిన సిఎం కీలక వ్యాఖ్యలు చేసారు. ఐక్యంగా ఉండి ఆదర్శంగా నిలవాల్సిన నేతలు ప్రోటోకాల్ పేరుతో, ఫ్లెక్సీలపై ఫోటోల పేరుతో ఘర్షణ పడడం సరికాదని సీఎం వ్యాఖ్యానించారు. ఏదైనా పొరపాటు, తప్పు జరిగినా పార్టీ పెద్దలకు, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి కానీ…ఇలా గొడవ పడడం వల్ల లాభం ఉండదన్న సిఎం పేర్కొన్నారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: