Friday, September 11, 2026
News Navigation
Friday, September 11, 2026
News Navigation

Breaking

Friday, September 11, 2026
Home National సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారీమన్ కన్నుమూత

సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నారీమన్ కన్నుమూత

by Satya
Nariman

ప్రముఖ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఈ ఉదయం ఢిల్లీలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నారీమన్ వయసు 95 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. న్యాయ రంగంలో చేసిన సేవలకు గాను నారీమన్ ను భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. బాంబే హైకోర్టు లాయర్ గా నారీమన్ తన కెరీర్ ను ప్రారంభించారు. 1972లో ఆయన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు. అయితే, అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ ఎమర్జెన్సీని విధించడంతో… ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఆయన 1975లో సొలిసిటర్ జనరల్ పదవికి రాజీనామా చేశారు. నారీమన్ మృతితో ఒక యుగం ముగిసిందని కాంగ్రెస్ నేత, సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింఘ్వ తెలిపారు. న్యాయ రంగం, ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి గుండెల్లో నారీమన్ చిరస్థాయిగా నిలిచిపోతారని సింఘ్వీ అన్నారు.

Read Also..

Follow us on : Facebook, Instagram & YouTube.


మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.
రైల్వే వ్యవస్థ సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని …
ఢిల్లీ పీడబ్ల్యూడీ ఇంజనీరింగ్ కేడర్‌కు కేంద్రం ఆమోదం.
పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని మంజూరైన ఇంజనీరింగ్ పోస్టులను సీపీడబ్ల్యూడీ కేడర్ నుంచి వేరు చేసే …
తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.
తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ చేసిన ఓ సైగ తీవ్ర రాజకీయ దుమారం రేపింది. మాజీ …
బీహార్‌లో ఉగ్రరూపం దాల్చిన వరదలు.
బీహార్‌లో భారీ వర్షాలకు తోడు నేపాల్‌ నుంచి వస్తున్న వరద నీటితో నదులు ఉగ్రరూపం దాల్చాయి. …

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: