అన్నమయ్య జిల్లాలో ఆర్టీసీ బస్సుల ప్రమాదం కలకలం రేపింది. గాలివీడు మండలం అరవీడు గ్రామం వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొనడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, ప్రమాదంతో కొంతసేపు రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను గాలివీడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. గాయపడిన వారి పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.ప్రమాదం కారణంగా కొంతసేపు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి రాకపోకలను పునరుద్ధరించారు.
Tag: